Yettu sesinaam jeyanee yimka ne nemee neṟumga

యెట్టు సేసినాఁ జేయనీ యింక నే నేమీ నెఱుఁగ
Language

(॥పల్లవి॥)
యెట్టు సేసినాఁ జేయనీ యింక నే నేమీ నెఱుఁగ
చుట్టరికమునకే చొక్కితి నేనూ

(॥॥)
మన సిచ్చి నా తోను మంచి మాట లాడఁగాను
ననిచి అన్నిటాఁ దన్ను నమ్మితి నేను
కనుఁగవ దెరచి యిక్కడ నన్నుఁ జూడఁ ను
చెనకి తనతో పొందు సేసితి నేనూ

(॥॥)
సారె సారె నప్పటిని సరసము లాడఁగాను
ఆరయఁ దనకు లో నయితి నేను
గారవించి యందరిలోఁ గడు నాతో నవ్వఁగాను
వూరక సంతోసాన వొడఁ బడితి సేనూ

(॥॥)
చిత్తగించి నా మీఁద సేస వెట్టి కూడఁగాను
హత్తి తన చెంత కిరవైతి నేనూ
యిత్తల శ్రీ వేంకటేశుఁడే నలమేలు మంగను
బత్తి సేయఁగా నాసలఁ బరగితి నేనూ

(||pallavi||)
yĕṭṭu sesinām̐ jeyanī yiṁka ne nemī nĕṟum̐ga
suṭṭarigamunage sŏkkidi nenū

(||||)
mana sichchi nā tonu maṁchi māḍa lāḍam̐gānu
nanisi anniḍām̐ dannu nammidi nenu
kanum̐gava dĕrasi yikkaḍa nannum̐ jūḍam̐ nu
sĕnagi tanado pŏṁdu sesidi nenū

(||||)
sārĕ sārĕ nappaḍini sarasamu lāḍam̐gānu
ārayam̐ danagu lo nayidi nenu
gāraviṁchi yaṁdarilom̐ gaḍu nādo navvam̐gānu
vūraga saṁtosāna vŏḍam̐ baḍidi senū

(||||)
sittagiṁchi nā mīm̐da sesa vĕṭṭi kūḍam̐gānu
hatti tana sĕṁta kiravaidi nenū
yittala śhrī veṁkaḍeśhum̐ḍe nalamelu maṁganu
batti seyam̐gā nāsalam̐ baragidi nenū