యెట్టు సేసినాఁ జేయనీ ఇఁకఁ దన చిత్తము
(॥పల్లవి॥)
యెట్టు సేసినాఁ జేయనీ ఇఁకఁ దన చిత్తము
ఇట్టిదని రమణుని కెఱిఁగించరే
(॥॥)
ముచ్చటెంతైనాఁ దీరచు మోహము గల వారికి
మచ్చికతో సారె సారె మాట లాడినా
వచ్చిరాని పద్యములె నుండు నడియాస
కొచ్చి కొచ్చి యెంతేసి కొసరినాను
(॥॥)
తని వేమిటాఁ బొందదు తమకించేవారికి
పెనఁగి పెనఁగి యెంత ప్రియపడినా
వినియు వినని మాట విధమై యుండుఁ దలఁపు
కనుఁ గొని యెదుటనే కాచుకుండినాను
(॥॥)
తగు లెంతైనాఁ బాయదు తతిఁ గూడిన వారికి
నగి యెటువలె గోరు నాటించినాను
తగ శ్రీ వేంకటేశుఁడు తానే వచ్చి నన్నుఁగూడె
చిగురుఁ జేగై వుండు చిమ్మి రేఁచినానూ
(||pallavi||)
yĕṭṭu sesinām̐ jeyanī im̐kam̐ dana sittamu
iṭṭidani ramaṇuni kĕṟim̐giṁchare
(||||)
muchchaḍĕṁtainām̐ dīrasu mohamu gala vārigi
machchigado sārĕ sārĕ māḍa lāḍinā
vachchirāni padyamulĕ nuṁḍu naḍiyāsa
kŏchchi kŏchchi yĕṁtesi kŏsarinānu
(||||)
tani vemiḍām̐ bŏṁdadu tamagiṁchevārigi
pĕnam̐gi pĕnam̐gi yĕṁta priyabaḍinā
viniyu vinani māḍa vidhamai yuṁḍum̐ dalam̐pu
kanum̐ gŏni yĕduḍane kāsuguṁḍinānu
(||||)
tagu lĕṁtainām̐ bāyadu tadim̐ gūḍina vārigi
nagi yĕḍuvalĕ goru nāḍiṁchinānu
taga śhrī veṁkaḍeśhum̐ḍu tāne vachchi nannum̐gūḍĕ
sigurum̐ jegai vuṁḍu simmi rem̐sinānū