Yettu maṟavamga vachchu niduvamti nee gunaalu

యెట్టు మఱవఁగ వచ్చు నిటువంటి నీ గుణాలు
Language

(॥పల్లవి॥)
యెట్టు మఱవఁగ వచ్చు నిటువంటి నీ గుణాలు
చుట్టరికమే మాకు చొక్కపు నిధానము

(॥॥)
యెనసిన రమణుఁడు యింపుతోడ నొసగిన
చనవే సామ్రాజ్యము సతులకును
తనివోక సారె సారెఁ దమి తోడఁ జూచేటి
కనుచూపులే నిత్యకల్యాణములు

(॥॥)
మొగ మెత్తి నాయకుఁడు మోహముతోఁ జల్లేటి
నగవె కోటి లాభము నాతులకును
చిగిరించే యాసతోడ చేసన్న చెనకులు
నిగిడించే సరసము నిండుకొన్న సంపదా

(॥॥)
పాటించి విభుఁడు తానే పై కొని కౌఁగిలించే
కూటమే నోము ఫలము కొమ్మలకును
యీటుతో శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
చాటువైన యీ రతులే కల భోగములూ

(||pallavi||)
yĕṭṭu maṟavam̐ga vachchu niḍuvaṁṭi nī guṇālu
suṭṭarigame māgu sŏkkabu nidhānamu

(||||)
yĕnasina ramaṇum̐ḍu yiṁpudoḍa nŏsagina
sanave sāmrājyamu sadulagunu
tanivoga sārĕ sārĕm̐ dami toḍam̐ jūseḍi
kanusūbule nityagalyāṇamulu

(||||)
mŏga mĕtti nāyagum̐ḍu mohamudom̐ jalleḍi
nagavĕ koḍi lābhamu nādulagunu
sigiriṁche yāsadoḍa sesanna sĕnagulu
nigiḍiṁche sarasamu niṁḍugŏnna saṁpadā

(||||)
pāḍiṁchi vibhum̐ḍu tāne pai kŏni kaum̐giliṁche
kūḍame nomu phalamu kŏmmalagunu
yīḍudo śhrī veṁkaḍeśha yiṭṭe nannu nelidivi
sāḍuvaina yī radule kala bhogamulū