యెట్టయినానాయఁ గాక యేమాయను
(॥పల్లవి॥)
యెట్టయినానాయఁ గాక యేమాయను
నెట్టుకొన్న నావలపు నీ చేతిది యిఁకను
(॥॥)
తగ నీవు మన్నించేది తలఁపున నెఱుఁగుదు
సొగిసి యట్టే పదరి సొలయుదును
నిగిడి నన్ను నడుపే నీ నేరుపో యిది
బగివాయకున్న నా భ్రమతో యెఱఁగను
(॥॥)
చేకొన్నవాఁ వు నన్నుఁ జేరి యేలే దెఱుఁగుదు
యీకడ విరహమున నిట్టే దూరుదు
జోకతో నింత సేసే నీ సొంపుల యాలాటమో
కాకరి(?) నా తమకపు కందువో యెఱఁగను
(॥॥)
సరుస నన్నుఁ బెండ్లాడి చనవిచ్చు టెఱుఁగుదు
పరవశపుఁ గౌఁగిట పచారింతును
యిరవై శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
సిరుల నీగుణ మింత సేసేది యెఱఁగనూ
(||pallavi||)
yĕṭṭayinānāyam̐ gāga yemāyanu
nĕṭṭugŏnna nāvalabu nī sedidi yim̐kanu
(||||)
taga nīvu manniṁchedi talam̐puna nĕṟum̐gudu
sŏgisi yaṭṭe padari sŏlayudunu
nigiḍi nannu naḍube nī nerubo yidi
bagivāyagunna nā bhramado yĕṟam̐ganu
(||||)
segŏnnavām̐ vu nannum̐ jeri yele dĕṟum̐gudu
yīgaḍa virahamuna niṭṭe dūrudu
jogado niṁta sese nī sŏṁpula yālāḍamo
kāgari(?) nā tamagabu kaṁduvo yĕṟam̐ganu
(||||)
sarusa nannum̐ bĕṁḍlāḍi sanavichchu ṭĕṟum̐gudu
paravaśhabum̐ gaum̐giḍa pasāriṁtunu
yiravai śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
sirula nīguṇa miṁta sesedi yĕṟam̐ganū