(॥పల్లవి॥)
యెశోద నీబిడ్డ నేమందుము
రాశికెక్క మమ్ము రక్షించుమనవో
(॥యెశో॥)
వుట్టమీఁదటనున్నపాలు వెన్నా
చట్లతోడనెసాదించీ
కొట్లుగొట్టుచు గోపాళులుఁదాను
అట్లు తోడనే యారగించీని
(॥యెశో॥)
జిడ్లు గాకుండ చిలుపాలుఁ దేనె
తెడ్లతోఁ దినీ దేవి దేవి
గుడ్లకొలఁది కోరి మెసఁగుచు
దిడ్లకంతలఁదిరుగాడీని
(॥యెశో॥)
పండ్లుఁ గాయలును బాసలు వీదుల
దొండ్లుగాఁ జేసి దొబ్బి దొబ్బి
బండ్ల శ్రీవేంకటపతి యలమేల్ మంగతో
యిండ్లిండ్ల వాకిండ్ల నేఁగే రదివో
(||pallavi||)
yĕśhoda nībiḍḍa nemaṁdumu
rāśhigĕkka mammu rakṣhiṁchumanavo
(||yĕśho||)
vuṭṭamīm̐daḍanunnabālu vĕnnā
saṭladoḍanĕsādiṁchī
kŏṭlugŏṭṭusu gobāḽulum̐dānu
aṭlu toḍane yāragiṁchīni
(||yĕśho||)
jiḍlu gāguṁḍa silubālum̐ denĕ
tĕḍladom̐ dinī devi devi
guḍlagŏlam̐di kori mĕsam̐gusu
diḍlagaṁtalam̐dirugāḍīni
(||yĕśho||)
paṁḍlum̐ gāyalunu bāsalu vīdula
dŏṁḍlugām̐ jesi dŏbbi dŏbbi
baṁḍla śhrīveṁkaḍabadi yalamel maṁgado
yiṁḍliṁḍla vāgiṁḍla nem̐ge radivo