Yeṟumguno yeṟamgamdo yimtulu vinnavimchare

యెఱుఁగునో యెఱఁగఁడో యింతులు విన్నవించరే
Language

(॥పల్లవి॥)
యెఱుఁగునో యెఱఁగఁడో యింతులు విన్నవించరే
మెఱసి యిన్నిటా నేను మేలుదానఁ జుమ్మీ

(॥॥)
కోపగించఁ జుమ్మీ కొసరి తనతో నేను
చపులలో నా బత్తి చూపితిఁ గాని
వోపననఁ జుమ్మీ వొడివట్టితేఁ దనతో
కాఁపురము సేసేవారి గతు లివిగాని

(॥॥)
వేసరించఁ జుమ్మీ వెడమాట లాడి నేను
ఆసపడి సరసము లాడుదుఁ గాని
వాసు లెంచఁ జుమ్మీ వలచి తన సరుస
సేసవెట్టి కూచుండి చెలఁగితిఁ గాని

(॥॥)
అలయించఁ జుమ్మీ అట్టే తాఁ గూడఁగా నేను
యెలమి రతులఁ దనియించితిఁ గాని
అలరి శ్రీ వేంకటేశుఁ డంతలోనే నన్నుఁగూడే
అలమేల్మంగను నేను అవునంటీఁ గాని

(||pallavi||)
yĕṟum̐guno yĕṟam̐gam̐ḍo yiṁtulu vinnaviṁchare
mĕṟasi yinniḍā nenu meludānam̐ jummī

(||||)
kobagiṁcham̐ jummī kŏsari tanado nenu
sabulalo nā batti sūbidim̐ gāni
vobananam̐ jummī vŏḍivaṭṭidem̐ danado
kām̐puramu sesevāri gadu livigāni

(||||)
vesariṁcham̐ jummī vĕḍamāḍa lāḍi nenu
āsabaḍi sarasamu lāḍudum̐ gāni
vāsu lĕṁcham̐ jummī valasi tana sarusa
sesavĕṭṭi kūsuṁḍi sĕlam̐gidim̐ gāni

(||||)
alayiṁcham̐ jummī aṭṭe tām̐ gūḍam̐gā nenu
yĕlami radulam̐ daniyiṁchidim̐ gāni
alari śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐gūḍe
alamelmaṁganu nenu avunaṁṭīm̐ gāni