Yeṟumganaa ne nemainaa yimtulaala naa vibhuni

యెఱుఁగనా నే నేమైనా యింతులాల నా విభుని
Language

(॥పల్లవి॥)
యెఱుఁగనా నే నేమైనా యింతులాల నా విభుని
నెఱవుగా వెంగేలు నే నేలాడేనే

(॥॥)
మనసురా సేవసేసి మాటలాడే యాఁటదానిఁ
గనుఁ గొంటే దయవుట్టుఁ గాక పతికి
పెనఁగి పెనఁగి వట్టి బిగువులు బిగిసితే
యెనసునా పొందులు యెరవులే కాక

(॥॥)
అతి వినయాలు చూపి అండనున్నయాఁటదాని
రతి వేడుకౌఁ గాక రమణునికి
చతురతలు మెఱసి సణఁగులు చల్లితేను
తతి నియ్యకోలౌనా తడఁ బాటేకాక

(॥॥)
మాఁగిన మోవి యిచ్చి మరిగిన యాఁటదాని
కౌఁగి లింపౌఁ గాక శ్రీవేంకటపతికి
చేఁగదేర నన్నుఁ గూడె చేఁత లెవ్వతె సేసినా
లోఁగక వెల్లివిరౌనా లోలోనే కాకా

(||pallavi||)
yĕṟum̐ganā ne nemainā yiṁtulāla nā vibhuni
nĕṟavugā vĕṁgelu ne nelāḍene

(||||)
manasurā sevasesi māḍalāḍe yām̐ṭadānim̐
ganum̐ gŏṁṭe dayavuṭṭum̐ gāga padigi
pĕnam̐gi pĕnam̐gi vaṭṭi biguvulu bigiside
yĕnasunā pŏṁdulu yĕravule kāga

(||||)
adi vinayālu sūbi aṁḍanunnayām̐ṭadāni
radi veḍugaum̐ gāga ramaṇunigi
saduradalu mĕṟasi saṇam̐gulu sallidenu
tadi niyyagolaunā taḍam̐ bāḍegāga

(||||)
mām̐gina movi yichchi marigina yām̐ṭadāni
kaum̐gi liṁpaum̐ gāga śhrīveṁkaḍabadigi
sem̐gadera nannum̐ gūḍĕ sem̐ta lĕvvadĕ sesinā
lom̐gaga vĕlliviraunā lolone kāgā