Yeṟumgami sesugona nemtige neegu

యెఱుఁగమి సేసుకొన నేఁటికే నీకు
Language

(॥పల్లవి॥)
యెఱుఁగమి సేసుకొన నేఁటికే నీకు
యెఱుకతోనే చనవియ్యవయ్యా

(॥॥)
చిలుకుఁ జూపుల తోడ సెలవి నవ్వులతోడ
నిలుచున్న దెవ్వతో నీ ముందరను
మొలక చన్నులు గొంత మొనలు గదలఁ గాను
సొలసీ నప్పటి నిన్నుఁ జూడవయ్యా

(॥॥)
తీగెమాట లాడుకొంటా తేరి సన్న సేసుకొంటా
బాగుగా నెవ్వతో నీ పక్క నున్నది
చేగదేరి మొనగోరి చిమ్ము లమరఁ గాను
సోగ చేతులు చాఁచీని చూడవయ్యా

(॥॥)
విరులు గానుక యిచ్చి వేమారుఁ గొచ్చి కొచ్చి
పరగఁ గొలువు సేసెఁ బాయ కెవ్వతో
యిరవుగ శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
సొరిది నాపె మొగము చూడవయ్యా

(||pallavi||)
yĕṟum̐gami sesugŏna nem̐ṭige nīgu
yĕṟugadone sanaviyyavayyā

(||||)
silugum̐ jūbula toḍa sĕlavi navvuladoḍa
nilusunna dĕvvado nī muṁdaranu
mŏlaga sannulu gŏṁta mŏnalu gadalam̐ gānu
sŏlasī nappaḍi ninnum̐ jūḍavayyā

(||||)
tīgĕmāḍa lāḍugŏṁṭā teri sanna sesugŏṁṭā
bāgugā nĕvvado nī pakka nunnadi
segaderi mŏnagori simmu lamaram̐ gānu
soga sedulu sām̐sīni sūḍavayyā

(||||)
virulu gānuga yichchi vemārum̐ gŏchchi kŏchchi
paragam̐ gŏluvu sesĕm̐ bāya kĕvvado
yiravuga śhrī veṁkaḍeśha nannu nelidivi
sŏridi nābĕ mŏgamu sūḍavayyā