యెఱుఁగఁడా తానే మైనా యేల నన్ను జరసీని
(॥పల్లవి॥)
యెఱుఁగఁడా తానే మైనా యేల నన్ను జరసీని
మెఱసే తన గుణాలు మెచ్చుకొందుఁ గాకా
(॥॥)
నగితే మారుకు మారు నగవచ్చునా తనతో
మొగము చూచి యట్టే మొక్కుదుఁగాకా
మగఁడు తా గో రూఁదితే మరి నేఁ జెనకుదునా
జిగి మీఱ సమ్మతించి సిగ్గున నుందుఁగాకా
(॥॥)
యెనసి తా మాటాడితే యెదురు మాటాడుదునా
వొనర వీనుల విని వూఁకొందుఁ గాకా
చెనకి పూబంతి వేసితేఁ దప్పించు కొందునా
అనుమానించక చేత నందుకొందుఁ గాకా
(॥॥)
ధరఁ దాఁ జెక్కు నొక్కితే తన చెక్కు నొక్కుదునె
వొరసి అందుకుఁ బాదా లొత్తుదుఁ గాకా
యిరవై శ్రీ వేంకటేశుఁడింతలోఁ దా నన్నుఁగూడె
గరువము చూపుదునా కౌఁగిలింతుఁ గాకా
(||pallavi||)
yĕṟum̐gam̐ḍā tāne mainā yela nannu jarasīni
mĕṟase tana guṇālu mĕchchugŏṁdum̐ gāgā
(||||)
nagide mārugu māru nagavachchunā tanado
mŏgamu sūsi yaṭṭe mŏkkudum̐gāgā
magam̐ḍu tā go rūm̐dide mari nem̐ jĕnagudunā
jigi mīṟa sammadiṁchi sigguna nuṁdum̐gāgā
(||||)
yĕnasi tā māḍāḍide yĕduru māḍāḍudunā
vŏnara vīnula vini vūm̐kŏṁdum̐ gāgā
sĕnagi pūbaṁti vesidem̐ dappiṁchu kŏṁdunā
anumāniṁchaga seda naṁdugŏṁdum̐ gāgā
(||||)
dharam̐ dām̐ jĕkku nŏkkide tana sĕkku nŏkkudunĕ
vŏrasi aṁdugum̐ bādā lŏttudum̐ gāgā
yiravai śhrī veṁkaḍeśhum̐ḍiṁtalom̐ dā nannum̐gūḍĕ
garuvamu sūbudunā kaum̐giliṁtum̐ gāgā