Yeṟumga kadigidenu yeggaayanaa

యెఱుఁగ కడిగితేను యెగ్గాయనా
Language

(॥పల్లవి॥)
యెఱుఁగ కడిగితేను యెగ్గాయనా
తఱితో సిగ్గువడేవు తగవా నీవూ

(॥॥)
యెలమి నీ వద్ది యింతి కేమౌదు వంటేను
అలవోకగాఁ జెప్పే వదేరా నీవు
మలసి మీ యిద్దరికి మంచి యీ డౌ నంటేను
సెలవుల నవ్వేవు చేరి యేమీ నీవూ

(॥॥)
పొంతనా లిద్దరికిని పొసఁగునా యంటేను
యింత లోనే తలవంచే వేరా నీవు
మంతనాన మీలోని మర్మము లడిగితేను
యెంత నన్నుఁ దిట్టేవు యేలరా నీవూ

(॥॥)
కూడిన మీ పానుపు పై గుఱుతులు చెప్పితేను
యీడుకు నాతోఁ బెనఁగే విదేరా నీవు
జాడతో శ్రీ వేంకటేశ సరి నన్నుఁ గూడితివి
ఆడినట్టే మాఁటాడే వవురా నీవూ

(||pallavi||)
yĕṟum̐ga kaḍigidenu yĕggāyanā
taṟido sigguvaḍevu tagavā nīvū

(||||)
yĕlami nī vaddi yiṁti kemaudu vaṁṭenu
alavogagām̐ jĕppe vaderā nīvu
malasi mī yiddarigi maṁchi yī ḍau naṁṭenu
sĕlavula navvevu seri yemī nīvū

(||||)
pŏṁtanā liddarigini pŏsam̐gunā yaṁṭenu
yiṁta lone talavaṁche verā nīvu
maṁtanāna mīloni marmamu laḍigidenu
yĕṁta nannum̐ diṭṭevu yelarā nīvū

(||||)
kūḍina mī pānubu pai guṟudulu sĕppidenu
yīḍugu nādom̐ bĕnam̐ge viderā nīvu
jāḍado śhrī veṁkaḍeśha sari nannum̐ gūḍidivi
āḍinaṭṭe mām̐ṭāḍe vavurā nīvū