యెఱుక సేసుకొందురా యీ పనులు
(॥పల్లవి॥)
యెఱుక సేసుకొందురా యీ పనులు
మఱుఁగున దాఁగితే మందలించవలెనా
(॥॥)
తరుణి తన్నుఁజూచె తలవంచుకొంటి నేను
వొరసి నన్నేల తాను వొడివట్టీనే
సరసము లాడఁగాను తెరవేసుకొంటి నేను
సరుగ వచ్చి నా కెంత సమ్మతించఁ జెప్పీనే
(॥॥)
సుదతి తనతో నవ్వె సురటి మాటిడుకొంటి
గుదిగొని నన్ను నేల గోర సూఁదీనే
కదిసి యాపె వుండఁగా కడ చిత్తరు చూచితి
చెదరక నన్ను నెంత చెక్కులు నొక్కీనే
(॥॥)
ఇంతి దనకొప్పు దువ్వె నివ్వలిమోమైతి నేను
ఇంతలోనే తా నేల నా యిక్కు వంటీనే
చెంత నాకె పొందు చూపి శ్రీ వేంకటేశుఁడు తాను
యెంత నన్ను గూడి తాను ఇంపులు చల్లీనే
(||pallavi||)
yĕṟuga sesugŏṁdurā yī panulu
maṟum̐guna dām̐gide maṁdaliṁchavalĕnā
(||||)
taruṇi tannum̐jūsĕ talavaṁchugŏṁṭi nenu
vŏrasi nannela tānu vŏḍivaṭṭīne
sarasamu lāḍam̐gānu tĕravesugŏṁṭi nenu
saruga vachchi nā kĕṁta sammadiṁcham̐ jĕppīne
(||||)
sudadi tanado navvĕ suraḍi māḍiḍugŏṁṭi
gudigŏni nannu nela gora sūm̐dīne
kadisi yābĕ vuṁḍam̐gā kaḍa sittaru sūsidi
sĕdaraga nannu nĕṁta sĕkkulu nŏkkīne
(||||)
iṁti danagŏppu duvvĕ nivvalimomaidi nenu
iṁtalone tā nela nā yikku vaṁṭīne
sĕṁta nāgĕ pŏṁdu sūbi śhrī veṁkaḍeśhum̐ḍu tānu
yĕṁta nannu gūḍi tānu iṁpulu sallīne