యెరవు సేసుక యీతఁడేల దూరెనే
(॥పల్లవి॥)
యెరవు సేసుక యీతఁడేల దూరెనే
యిరవై తా నున్నాఁడంటా నేమి సేసేది
(॥॥)
ముచ్చట లాడె నంటా మోహము చల్లె నంటా
యిచ్చకానఁ దనకు నే నేమి సేసేదే
కచ్చుపెట్టి వుండె నంటా కడగోర గీరె నంటా
యిచ్చటఁ దనకు సేవ యేమి సేసేదే
(॥॥)
పక్కనఁ దా నవ్వె నంటా పైఁ జేయి వేసె నంటా
యిక్కడఁ దన కతల కేమి సేసేదే
మిక్కిలి వలచె నంటా మేలి మిట్టే యాడె నంటా
యెక్కడ నైనా వేసా లేమి సేసేదే
(॥॥)
కన్నులనే మొక్కె నంటా కౌఁగిటికిఁ జిక్కెనంటా
యెన్నిక గురుతులు మై నేమి సేసేదే
నన్ను శ్రీ వేంకటేశుఁడు నయమునఁ గూడె నంటా
యెన్ని మెచ్చులని మెచ్చి యేమి సేసేదే.
(||pallavi||)
yĕravu sesuga yīdam̐ḍela dūrĕne
yiravai tā nunnām̐ḍaṁṭā nemi sesedi
(||||)
muchchaḍa lāḍĕ naṁṭā mohamu sallĕ naṁṭā
yichchagānam̐ danagu ne nemi sesede
kachchubĕṭṭi vuṁḍĕ naṁṭā kaḍagora gīrĕ naṁṭā
yichchaḍam̐ danagu seva yemi sesede
(||||)
pakkanam̐ dā navvĕ naṁṭā paim̐ jeyi vesĕ naṁṭā
yikkaḍam̐ dana kadala kemi sesede
mikkili valasĕ naṁṭā meli miṭṭe yāḍĕ naṁṭā
yĕkkaḍa nainā vesā lemi sesede
(||||)
kannulane mŏkkĕ naṁṭā kaum̐giḍigim̐ jikkĕnaṁṭā
yĕnniga gurudulu mai nemi sesede
nannu śhrī veṁkaḍeśhum̐ḍu nayamunam̐ gūḍĕ naṁṭā
yĕnni mĕchchulani mĕchchi yemi sesede.