Yeravu le kiddaramoo niyyagolai yumtam gaaga

యెరవు లే కిద్దరమూ నియ్యకోలై యుంటఁ గాక
Language

(॥పల్లవి॥)
యెరవు లే కిద్దరమూ నియ్యకోలై యుంటఁ గాక
వెరవులు సారె సారె వెదకఁగ నేలే

(॥॥)
మనసు లెనయుదాఁకా మంతనము లాడేది
చనవు గలుగు దాఁకా సాదించేది
తనివి గలుగు దాఁకాఁ దత్తరించి కొసరేది
పను లీడేరితే మరి పచరించనేలే

(॥॥)
పంతములు వచ్చుదాఁకాఁ బట్టి పట్టి పెనఁగేది
చింతలు దీరుదాఁకాఁ జెక్కు నొక్కేది
సంతోము గల దాఁకా సరసము లాడేది
వింత లేక వున్నవేళ విచారము లేలే

(॥॥)
సేసలు వెట్టిన దాఁకా సిగ్గుల తోడ నుండేది
ఆసలు ఫలించుదాఁకా నాఱ డయ్యేది
బాస యిచ్చి శ్రీవేంకటపతి దానే నన్ను నేలె
వాసి నలమేల్మంగను వక్కణించ నేలే

(||pallavi||)
yĕravu le kiddaramū niyyagolai yuṁṭam̐ gāga
vĕravulu sārĕ sārĕ vĕdagam̐ga nele

(||||)
manasu lĕnayudām̐kā maṁtanamu lāḍedi
sanavu galugu dām̐kā sādiṁchedi
tanivi galugu dām̐kām̐ dattariṁchi kŏsaredi
panu līḍeride mari pasariṁchanele

(||||)
paṁtamulu vachchudām̐kām̐ baṭṭi paṭṭi pĕnam̐gedi
siṁtalu dīrudām̐kām̐ jĕkku nŏkkedi
saṁtomu gala dām̐kā sarasamu lāḍedi
viṁta lega vunnaveḽa visāramu lele

(||||)
sesalu vĕṭṭina dām̐kā siggula toḍa nuṁḍedi
āsalu phaliṁchudām̐kā nāṟa ḍayyedi
bāsa yichchi śhrīveṁkaḍabadi dāne nannu nelĕ
vāsi nalamelmaṁganu vakkaṇiṁcha nele