Yeṟamganaa tanasuddu linniyu ne vinanaa

యెఱఁగనా తనసుద్దు లిన్నియు నే విననా
Language

(॥పల్లవి॥)
యెఱఁగనా తనసుద్దు లిన్నియు నే విననా
మఱి నాతో దొఱఁగుచు మందలించీఁ గాక

(॥॥)
చెలిఁ జూచి పరాకు సేసుకొని నా ముందర
పొలసి నిన్న నెట్లాఁ బొందు సేసేను
యెలమి నావద్ద వచ్చి యెఱఁ గనట్టే వున్నాఁడు
సొలసి ఇందాఁకా నెట్టు జూజాలందు నాడెనే

(॥॥)
చేరవచ్చితే నాపెతో సిగ్గులు వడేటివాఁడు
సారెకు నెట్లా సరసము లాడెనే
కూరిమి నన్నుఁ బాయక కూడినట్టే వున్నవాఁడు
గారవించి యెట్లా రేకలు వెట్టి అంపెనే

(॥॥)
మగువఁ దాను తెరమఱఁగుల నున్నవారు
తగిలి యెట్టాడ మెడఁ దాళి గట్టే నే
జిగి నలమేల్మంగను శ్రీ వేంకటేశుఁడు దాను
పగటున నన్నుఁ గూడి పాయ కాపెఁ గూఁడెనే.

(||pallavi||)
yĕṟam̐ganā tanasuddu linniyu ne vinanā
maṟi nādo dŏṟam̐gusu maṁdaliṁchīm̐ gāga

(||||)
sĕlim̐ jūsi parāgu sesugŏni nā muṁdara
pŏlasi ninna nĕṭlām̐ bŏṁdu sesenu
yĕlami nāvadda vachchi yĕṟam̐ ganaṭṭe vunnām̐ḍu
sŏlasi iṁdām̐kā nĕṭṭu jūjālaṁdu nāḍĕne

(||||)
seravachchide nābĕdo siggulu vaḍeḍivām̐ḍu
sārĕgu nĕṭlā sarasamu lāḍĕne
kūrimi nannum̐ bāyaga kūḍinaṭṭe vunnavām̐ḍu
gāraviṁchi yĕṭlā regalu vĕṭṭi aṁpĕne

(||||)
maguvam̐ dānu tĕramaṟam̐gula nunnavāru
tagili yĕṭṭāḍa mĕḍam̐ dāḽi gaṭṭe ne
jigi nalamelmaṁganu śhrī veṁkaḍeśhum̐ḍu dānu
pagaḍuna nannum̐ gūḍi pāya kābĕm̐ gūm̐ḍĕne.