Yeṟabarigamu lela yemta sesevoo

యెఱపరికము లేల యెంత సేసేవూ
Language

(॥పల్లవి॥)
యెఱపరికము లేల యెంత సేసేవూ
తఱవాతి పనులకుఁ దడవు గాదా

(॥॥)
కన్నుల కలికి నీకుఁ గాచుకున్న దదివో
వెన్నెలబయట నీవు విచ్చేసు దాఁకా
నన్నేల యెలయించేవు నాతో నేల నవ్వేవు
యిన్నేసి మాయలకుఁ జో టీడ నున్నదా

(॥॥)
ఆసలఁ బొరుగుచెలి అలకించినదివో
వేసాల నీ మాట లెల్ల విన్నదాఁకాను
గాసిఁ బెట్టకు నన్ను యేకతములు మాను నాతో
నీసటల కింతేసి కల్లా నే నోపెనా

(॥॥)
మునుపే ని న్నాపె గూడి మోము చూచినదివో
ననుపై సోరణగండ్ల నప్పు కొంటేను
యెనసితి విదె నన్ను యిప్పుడె శ్రీ వేంకటేశ
చెనకే నీ చేఁతలకు చెప్ప నున్నదా.

(||pallavi||)
yĕṟabarigamu lela yĕṁta sesevū
taṟavādi panulagum̐ daḍavu gādā

(||||)
kannula kaligi nīgum̐ gāsugunna dadivo
vĕnnĕlabayaḍa nīvu vichchesu dām̐kā
nannela yĕlayiṁchevu nādo nela navvevu
yinnesi māyalagum̐ jo ṭīḍa nunnadā

(||||)
āsalam̐ bŏrugusĕli alagiṁchinadivo
vesāla nī māḍa lĕlla vinnadām̐kānu
gāsim̐ bĕṭṭagu nannu yegadamulu mānu nādo
nīsaḍala kiṁtesi kallā ne nobĕnā

(||||)
munube ni nnābĕ gūḍi momu sūsinadivo
nanubai soraṇagaṁḍla nappu kŏṁṭenu
yĕnasidi vidĕ nannu yippuḍĕ śhrī veṁkaḍeśha
sĕnage nī sem̐talagu sĕppa nunnadā.