యెప్పుడూఁ దనకు నాకు నెడసీనా యెంతైనా
(॥పల్లవి॥)
యెప్పుడూఁ దనకు నాకు నెడసీనా యెంతైనా
ముప్పిరి సంతోసమాయ మొక్కితి నేననలే
(॥॥)
యెవ్వతైనాఁ దనమతి కింపైతే జాలుఁ గాక
నవ్వుతాఁ గంటకాలాడ నా కేలే
నివ్వటిల్లు మోహములు నిండుకొంటేఁ జాలుఁ గాక
ఆవ్వల నివ్వలఁ దము నౌఁ గా దన నేలే
(॥॥)
ఆపెకూఁ దనకు వావు లమరితేఁ జాలుఁ గాక
చూపించి పొంతనాలు నే సోదించ నేలే
యే పొద్దూఁ దమకోర్కు లీడేరితేఁ జాలుఁ గాక
కోపము దెచ్చుక తమ్ముఁ గొర నేలే
(॥॥)
విచ్చన విడిఁ దమకు వేడుకైతేఁ జాలుఁ గాక
యెచ్చు కుందులు వెదక నిఁక నేలే
ఇచ్చట శ్రీ వేంకటేశుఁడిట్టే తా నన్ను నేలే
పచ్చిదేరెఁ బను లెల్లా పచారించ నేలే
(||pallavi||)
yĕppuḍūm̐ danagu nāgu nĕḍasīnā yĕṁtainā
muppiri saṁtosamāya mŏkkidi nenanale
(||||)
yĕvvadainām̐ danamadi kiṁpaide jālum̐ gāga
navvudām̐ gaṁṭagālāḍa nā kele
nivvaḍillu mohamulu niṁḍugŏṁṭem̐ jālum̐ gāga
āvvala nivvalam̐ damu naum̐ gā dana nele
(||||)
ābĕgūm̐ danagu vāvu lamaridem̐ jālum̐ gāga
sūbiṁchi pŏṁtanālu ne sodiṁcha nele
ye pŏddūm̐ damagorgu līḍeridem̐ jālum̐ gāga
kobamu dĕchchuga tammum̐ gŏra nele
(||||)
vichchana viḍim̐ damagu veḍugaidem̐ jālum̐ gāga
yĕchchu kuṁdulu vĕdaga nim̐ka nele
ichchaḍa śhrī veṁkaḍeśhum̐ḍiṭṭe tā nannu nele
pachchiderĕm̐ banu lĕllā pasāriṁcha nele