Yeppudoo nannimtadaanu yeedersa nee bhaaramu

యెప్పుడూ నన్నింతటాను యీడేర్చ నీ భారము
Language

(॥పల్లవి॥)
యెప్పుడూ నన్నింతటాను యీడేర్చ నీ భారము
చెప్పినట్టల్లా నీవే సేసేవు గాకా

(॥॥)
వేడుకతో నే నెంత వేగిరించినా నేమి
వాడికతో మన్నించవలెఁ గా నీవూ
వాడి యెఱిఁగిన నిన్నుఁ బైకొని కొసర నేమి
జాడ తోడ నీవే నాకు చన విచ్చేవు గాకా

(॥॥)
ఆసపడి నీ పాదాల కటు నే మొక్కిన నేమి
వాసితో నా దిక్కు చూడవలెఁగా నీవూ
సేస వెట్టితివి నిన్నుఁ జెక్కు నొక్క నిఁక నేమి
బాస దప్ప కిట్టే నన్నుఁ బాలించేవు గాకా

(॥॥)
యెదురుగా వచ్చి నిన్ను నింటికిఁ దెచ్చితే నేమి
వదలక ఆదరించవలెఁగా నీవూ
యిదివో శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
పొదిగి కూడితి విట్టే భోగించేవు గాకా

(||pallavi||)
yĕppuḍū nanniṁtaḍānu yīḍersa nī bhāramu
sĕppinaṭṭallā nīve sesevu gāgā

(||||)
veḍugado ne nĕṁta vegiriṁchinā nemi
vāḍigado manniṁchavalĕm̐ gā nīvū
vāḍi yĕṟim̐gina ninnum̐ baigŏni kŏsara nemi
jāḍa toḍa nīve nāgu sana vichchevu gāgā

(||||)
āsabaḍi nī pādāla kaḍu ne mŏkkina nemi
vāsido nā dikku sūḍavalĕm̐gā nīvū
sesa vĕṭṭidivi ninnum̐ jĕkku nŏkka nim̐ka nemi
bāsa dappa kiṭṭe nannum̐ bāliṁchevu gāgā

(||||)
yĕdurugā vachchi ninnu niṁṭigim̐ dĕchchide nemi
vadalaga ādariṁchavalĕm̐gā nīvū
yidivo śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
pŏdigi kūḍidi viṭṭe bhogiṁchevu gāgā