Yenni nerusugonnaamde yimduge veragayyeeni

యెన్ని నేరుచుకొన్నాఁడే యిందుకే వెరగయ్యీని
Language

(॥పల్లవి॥)
యెన్ని నేరుచుకొన్నాఁడే యిందుకే వెరగయ్యీని
చెన్నుమీర యశోదకుఁ జెప్పరే యీ సుద్దులు

(॥॥)
వుట్లు దించఁగఁ గాచుకున్న కృష్ణుఁనిఁజూచి
తిట్లు దిట్టు గొల్లెత తేరి చూడఁగా
చెట్ల వంటి చన్నులు చేత ముట్టి పెనఁగీని
చుట్ల చొల్లేల తోడఁ జూడరే యీబాలుని

(॥॥)
వేవేలు పండ్ల గంప విడుమంటా వేరొకతె
పూవుల చెండునఁ గృష్ణుఁ బూఁచివేయఁ గా
మోవి పండ్లంట్ట బట్టె ముంచియాకె యధరము
చేవమీఱి యున్నాఁడేమి సేతమే యీ బాలుని

(॥॥)
మలసె నేఁడలమేలుమంగ శ్రీవేంకటకృష్ణుఁ
నలమిపట్టి చేతికోలలు దియ్యఁగా
కలసె నంతలోనే కౌఁగిలించి రతులను
వెలసి మెచ్చఁగదరే వేడుక యీ బాలుని

(||pallavi||)
yĕnni nerusugŏnnām̐ḍe yiṁduge vĕragayyīni
sĕnnumīra yaśhodagum̐ jĕppare yī suddulu

(||||)
vuṭlu diṁcham̐gam̐ gāsugunna kṛṣhṇum̐nim̐jūsi
tiṭlu diṭṭu gŏllĕda teri sūḍam̐gā
sĕṭla vaṁṭi sannulu seda muṭṭi pĕnam̐gīni
suṭla sŏllela toḍam̐ jūḍare yībāluni

(||||)
vevelu paṁḍla gaṁpa viḍumaṁṭā verŏgadĕ
pūvula sĕṁḍunam̐ gṛṣhṇum̐ būm̐siveyam̐ gā
movi paṁḍlaṁṭṭa baṭṭĕ muṁchiyāgĕ yadharamu
sevamīṟi yunnām̐ḍemi sedame yī bāluni

(||||)
malasĕ nem̐ḍalamelumaṁga śhrīveṁkaḍakṛṣhṇum̐
nalamibaṭṭi sedigolalu diyyam̐gā
kalasĕ naṁtalone kaum̐giliṁchi radulanu
vĕlasi mĕchcham̐gadare veḍuga yī bāluni