యేఁటికి దాచేవో కాక ఇపుడు నా యెదుటను
(॥పల్లవి॥)
యేఁటికి దాచేవో కాక ఇపుడు నా యెదుటను
పాటించి నీ కాపె సేసే బత్తి నీ వెఱుఁగవా
(॥॥)
పువ్వులను నిన్ను వేసి పొందు లెల్లా నెచ్చరించి
నవ్విన దెఱుఁగవా నాతి నీతోను
వువ్విళ్ళూర మోవి చూపి వుపచరించి సన్నలఁ
బవ్వళించే యిల్లు చూపే భావమ దెఱుఁగవా
(॥॥)
యిక్కువగా నెలుఁగిచ్చి యెఱుకలు సేసి యట్టే
నిక్కి చూచె నెఱుఁగవా నెలఁత నిన్ను
అక్కరఁ గొలువు సేసి అందరిలో నీ పాదము
తొక్కిన దెఱుఁగవా తొలుతనే నీవు
(॥॥)
పెదవిపై మాటలాడి ప్రియములు నీకుఁజెప్పి
కదిసిన దెఱుఁ గవా కాంత నిన్నును
అదన శ్రీ వేంకటేశ అప్పుడే నన్నేలితివి
యిదె నీకు దేవులాయ యీపెను నెఱుఁగవా
(||pallavi||)
yem̐ṭigi dāsevo kāga ibuḍu nā yĕduḍanu
pāḍiṁchi nī kābĕ sese batti nī vĕṟum̐gavā
(||||)
puvvulanu ninnu vesi pŏṁdu lĕllā nĕchchariṁchi
navvina dĕṟum̐gavā nādi nīdonu
vuvviḽḽūra movi sūbi vubasariṁchi sannalam̐
bavvaḽiṁche yillu sūbe bhāvama dĕṟum̐gavā
(||||)
yikkuvagā nĕlum̐gichchi yĕṟugalu sesi yaṭṭe
nikki sūsĕ nĕṟum̐gavā nĕlam̐ta ninnu
akkaram̐ gŏluvu sesi aṁdarilo nī pādamu
tŏkkina dĕṟum̐gavā tŏludane nīvu
(||||)
pĕdavibai māḍalāḍi priyamulu nīgum̐jĕppi
kadisina dĕṟum̐ gavā kāṁta ninnunu
adana śhrī veṁkaḍeśha appuḍe nannelidivi
yidĕ nīgu devulāya yībĕnu nĕṟum̐gavā