Yemti kayyaa neevu maado yelaadaa laadevu

యేఁటి కయ్యా నీవు మాతో యేలాటా లాడేవు
Language

(॥పల్లవి॥)
యేఁటి కయ్యా నీవు మాతో యేలాటా లాడేవు
నాఁటకపుదాననా నవ్వేదానఁ గాకా

(॥॥)
సారె నీతో బెనఁగ సరిదాననా
మేరలు మీఱఁగ నంత మేనదాననా
దూరి మాటలాడ బిరుదుల దాననా
యేరీతిఁ జేసినను నీ యిచ్చలోదానఁ గాకా

(॥॥)
నిక్కి నిక్కి నిన్నుఁ జూడ నీటుదాననా
తొక్కి పాదాలఁ బెనచ దొడ్డదాననా
చిక్కి మో వెడుగ నప్పిచ్చినదాననా
మక్కువ నీ వేలితే సమ్మతించేదానఁ గాకా

(॥॥)
తగవులఁ బెట్ట నేఁ బంతపుదాననా
తగిలి చేయి వట్టఁగ దంటదాననా
నిగిడి శ్రీ వేంకటేశ నీవే నన్నుఁగూడితివి
మిగులా నీ మన్ననల మెఱసేదానఁ గాకా

(||pallavi||)
yem̐ṭi kayyā nīvu mādo yelāḍā lāḍevu
nām̐ṭagabudānanā navvedānam̐ gāgā

(||||)
sārĕ nīdo bĕnam̐ga saridānanā
meralu mīṟam̐ga naṁta menadānanā
dūri māḍalāḍa birudula dānanā
yerīdim̐ jesinanu nī yichchalodānam̐ gāgā

(||||)
nikki nikki ninnum̐ jūḍa nīḍudānanā
tŏkki pādālam̐ bĕnasa dŏḍḍadānanā
sikki mo vĕḍuga nappichchinadānanā
makkuva nī velide sammadiṁchedānam̐ gāgā

(||||)
tagavulam̐ bĕṭṭa nem̐ baṁtabudānanā
tagili seyi vaṭṭam̐ga daṁṭadānanā
nigiḍi śhrī veṁkaḍeśha nīve nannum̐gūḍidivi
migulā nī mannanala mĕṟasedānam̐ gāgā