Yemtani seppe nenu yemani vineru meeru

యెంతని చెప్పే నేను యేమని వినేరు మీరు
Language

(॥పల్లవి॥)
యెంతని చెప్పే నేను యేమని వినేరు మీరు
సంతతము దైలువారి చల్లు వెద(?)లాడీనే

(॥॥)
మనసునఁ దాగే పాలు మరి లెక్కవెట్ట నేల
గొనకొని గుక్కిళ్ళు కొలవ నేల
నినుపులై యీతనికి నే వలచిన వలపు
యెనలేక చెలులాల యేల నన్నడిగేరే

(॥॥)
సెలవి నవ్విన నవ్వు చేటఁ డేమి గంపెఁ డేమి
పలుకు లెన్నేయ నేమి పదర నేమి
పలుమారు నాతని పైఁ బెట్టిన యాసలు
కొలచి కొలచి యెంత గుట్టు దెలిసేరే

(॥॥)
వేడుకై నరతులకు వెలలు చెప్పఁగరాదు
వాడిక మోవితేనె వడ్డించరాదు
యీడనె శ్రీ వేంకటేశుఁ డింత సేసె నన్నుఁగూడి
యీడువెట్టి మిమ్మిందరి నేలితేనే మెచ్చేరే

(||pallavi||)
yĕṁtani sĕppe nenu yemani vineru mīru
saṁtadamu dailuvāri sallu vĕda(?)lāḍīne

(||||)
manasunam̐ dāge pālu mari lĕkkavĕṭṭa nela
gŏnagŏni gukkiḽḽu kŏlava nela
ninubulai yīdanigi ne valasina valabu
yĕnalega sĕlulāla yela nannaḍigere

(||||)
sĕlavi navvina navvu seḍam̐ ḍemi gaṁpĕm̐ ḍemi
palugu lĕnneya nemi padara nemi
palumāru nādani paim̐ bĕṭṭina yāsalu
kŏlasi kŏlasi yĕṁta guṭṭu dĕlisere

(||||)
veḍugai naradulagu vĕlalu sĕppam̐garādu
vāḍiga movidenĕ vaḍḍiṁcharādu
yīḍanĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṁta sesĕ nannum̐gūḍi
yīḍuvĕṭṭi mimmiṁdari nelidene mĕchchere