Yemtani seppamga vachchu nimti neebai koorimi

యెంతని చెప్పఁగ వచ్చు నింతి నీపై కూరిమి
Language

(॥పల్లవి॥)
యెంతని చెప్పఁగ వచ్చు నింతి నీపై కూరిమి
వింతలాయ మాకు నెట్టి వేడుకో నీ మీఁదను

(॥॥)
గుబ్బలఁ బూసిన యట్టి కుంకుమ నీ మేన నంట
నబ్బురానఁ గొప్పు దువ్వీ నంగన నీకు
వుబ్బున నీవు గోర నూఁదినది నెఱఁగదు
పబ్బినది యెటువంటి పరాకో నీ మీఁదను

(॥॥)
కడుఁ జెక్కుల జవ్వాది గరఁగి నీపైఁ జింద
చిడిముడితో నిన్ను సింగారించీని
బెడఁగుఁ జన్నులు నీవు పిసికినా నెఱఁగదు
యెడయని పరవశ మెంతో నీ మీఁదను

(॥॥)
తురుము విరులు నీపైఁ దొరుగ నలమేల్మంగ
సిరుల నిన్ను నలమి శ్రీ వేంకటేశ
పిరిగొనఁ గౌఁగిట బిగించినా నెఱఁగదు
సురతాన నెటువలెఁ జొక్కెనో నీ మీఁదను

(||pallavi||)
yĕṁtani sĕppam̐ga vachchu niṁti nībai kūrimi
viṁtalāya māgu nĕṭṭi veḍugo nī mīm̐danu

(||||)
gubbalam̐ būsina yaṭṭi kuṁkuma nī mena naṁṭa
nabburānam̐ gŏppu duvvī naṁgana nīgu
vubbuna nīvu gora nūm̐dinadi nĕṟam̐gadu
pabbinadi yĕḍuvaṁṭi parāgo nī mīm̐danu

(||||)
kaḍum̐ jĕkkula javvādi garam̐gi nībaim̐ jiṁda
siḍimuḍido ninnu siṁgāriṁchīni
bĕḍam̐gum̐ jannulu nīvu pisiginā nĕṟam̐gadu
yĕḍayani paravaśha mĕṁto nī mīm̐danu

(||||)
turumu virulu nībaim̐ dŏruga nalamelmaṁga
sirula ninnu nalami śhrī veṁkaḍeśha
pirigŏnam̐ gaum̐giḍa bigiṁchinā nĕṟam̐gadu
suradāna nĕḍuvalĕm̐ jŏkkĕno nī mīm̐danu