యెంతని కొనియాడేనే యీతని నేనూ
(॥పల్లవి॥)
యెంతని కొనియాడేనే యీతని నేనూ
పొంతనే తా నెన్ని నేరుపులు నేర్చెనే
(॥॥)
మంతనము లాడించేది మనసు పెడ రేఁచేది
సంతసపు తన మేని చక్కఁదనమే
పంతము లిప్పించేది భావము గరఁగించేది
మంతుకు నెక్కిన తన మంచి గుణమే
(॥॥)
వేడుకలు వుట్టించేది వినోదాలు నెరిపేది
జాడతోఁ దా నాడేటి సరసములే
వాడికలు సేసేది వద్దఁ బాయ ని య్యనిది
చూడఁ గొత్తైన తన మెచ్చుల సింగారమే
(॥॥)
తగ మరిగించేది తనపొందు సేయించేది
తగులైన యటువంటి తన కౌఁగిలే
జిగిఁదా నింతలో నన్ను శ్రీ వేంకటేశుఁడు గూడె
యిగిరింపించీనా లిదే తన వలుపే
(||pallavi||)
yĕṁtani kŏniyāḍene yīdani nenū
pŏṁtane tā nĕnni nerubulu nersĕne
(||||)
maṁtanamu lāḍiṁchedi manasu pĕḍa rem̐sedi
saṁtasabu tana meni sakkam̐daname
paṁtamu lippiṁchedi bhāvamu garam̐giṁchedi
maṁtugu nĕkkina tana maṁchi guṇame
(||||)
veḍugalu vuṭṭiṁchedi vinodālu nĕribedi
jāḍadom̐ dā nāḍeḍi sarasamule
vāḍigalu sesedi vaddam̐ bāya ni yyanidi
sūḍam̐ gŏttaina tana mĕchchula siṁgārame
(||||)
taga marigiṁchedi tanabŏṁdu seyiṁchedi
tagulaina yaḍuvaṁṭi tana kaum̐gile
jigim̐dā niṁtalo nannu śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
yigiriṁpiṁchīnā lide tana valube