యెంతైనాఁ దనివోవఁ డిదివో తాను
(॥పల్లవి॥)
యెంతైనాఁ దనివోవఁ డిదివో తాను
బంతి నిట్టే నా పొందులు బాఁతెయ్యీనా తనకు
(॥॥)
చెక్కులపై జవ్వాది చేతఁదీసి కాంతకు
మిక్కిలి వేడుక తోడ మెత్తీఁ దాను
చొక్కపు సిరస నిండాఁ జుట్టు కొన్న పూదండలు
మిక్కుటముగా నాపె మెడ వేసీఁదానూ
(॥॥)
పాదమున నున్న తన బంగారు పెండెము
ఆదిగొని మెచ్చి పెట్టీ నాపెకుఁదాను
పోదిగా నంతటిలోనే పుక్కిటి తమ్ములము
మోదాన నాపెకుఁజూపి మోవి యిచ్చీఁదాను
(॥॥)
చందనకావివన్నె పచ్చడ మాపెకును నాకు
కందువల సరిగానే కప్పీఁ దాను
యిందులోనే శ్రీ వేంకటేశ్వరుఁడు నన్ను నేలే
కుందనఁపు టుంగరము గురు తిచ్చీఁదాను
(||pallavi||)
yĕṁtainām̐ danivovam̐ ḍidivo tānu
baṁti niṭṭe nā pŏṁdulu bām̐tĕyyīnā tanagu
(||||)
sĕkkulabai javvādi sedam̐dīsi kāṁtagu
mikkili veḍuga toḍa mĕttīm̐ dānu
sŏkkabu sirasa niṁḍām̐ juṭṭu kŏnna pūdaṁḍalu
mikkuḍamugā nābĕ mĕḍa vesīm̐dānū
(||||)
pādamuna nunna tana baṁgāru pĕṁḍĕmu
ādigŏni mĕchchi pĕṭṭī nābĕgum̐dānu
podigā naṁtaḍilone pukkiḍi tammulamu
modāna nābĕgum̐jūbi movi yichchīm̐dānu
(||||)
saṁdanagāvivannĕ pachchaḍa mābĕgunu nāgu
kaṁduvala sarigāne kappīm̐ dānu
yiṁdulone śhrī veṁkaḍeśhvarum̐ḍu nannu nele
kuṁdanam̐pu ṭuṁgaramu guru tichchīm̐dānu