Yemtaina nenu neeyimti nanaraa

యెంతైన నేను నీయింతి ననరా
Language

(॥పల్లవి॥)
యెంతైన నేను నీయింతి ననరా
సంతసాన నుండితేను చన వియ్యవలదా

(॥॥)
నీ వంటి రమణుఁడు నిచ్చ నాకుఁ గలుగఁగ
యేవల నా రాజసము లెక్కుడే కాదా
భావించి నీవు రాఁ గా నేఁ బవ్వళించి వుంటి నంటా
వేవేలు దూరు లేల నీ విభవమే కాదా

(॥॥)
యింతటి వాఁడవు నా యిచ్చలోనే వుండఁగాను
యెంత లేదు నాగర్వ మేమి చెప్పేది
పంతమాడి నేను నీపైఁ జేయి వేసితి నంటా
వింతమాట లాడేవు నీ వేడుకే కాదా

(॥॥)
కరుణానిధివి నా కౌఁగిటిలో నుండఁగాను
యిరవైన సంపదకు నేది మేర
నిరతి శ్రీ వేంకటేశ నిన్ను నేఁ గూడితి నంటా
గరిమెతో మెచ్చేవు కఱతలే కాదా.

(||pallavi||)
yĕṁtaina nenu nīyiṁti nanarā
saṁtasāna nuṁḍidenu sana viyyavaladā

(||||)
nī vaṁṭi ramaṇum̐ḍu nichcha nāgum̐ galugam̐ga
yevala nā rājasamu lĕkkuḍe kādā
bhāviṁchi nīvu rām̐ gā nem̐ bavvaḽiṁchi vuṁṭi naṁṭā
vevelu dūru lela nī vibhavame kādā

(||||)
yiṁtaḍi vām̐ḍavu nā yichchalone vuṁḍam̐gānu
yĕṁta ledu nāgarva memi sĕppedi
paṁtamāḍi nenu nībaim̐ jeyi vesidi naṁṭā
viṁtamāḍa lāḍevu nī veḍuge kādā

(||||)
karuṇānidhivi nā kaum̐giḍilo nuṁḍam̐gānu
yiravaina saṁpadagu nedi mera
niradi śhrī veṁkaḍeśha ninnu nem̐ gūḍidi naṁṭā
garimĕdo mĕchchevu kaṟadale kādā.