Yemtaina naa voja maanamdemi sedunu

యెంతైన నా వోజ మానఁడేమి సేతును
Language

(॥పల్లవి॥)
యెంతైన నా వోజ మానఁడేమి సేతును
అంతరంగ మెల్లా నాతో నానతియ్యవయ్యా

(॥॥)
నీ మన్నన పట్టు కొని నే నిందరీ నవ్వుదును
వేమరు నా రాజసాన విఱ్ఱవీఁగుదు
చేముంచి యిదెల్లా నీ చిత్తము వచ్చునో రాదో
ఆ మాట నాతో నీవానతియ్యవయ్యా

(॥॥)
పెంచిన మందెమేళాన పెక్కు వెంగే లాడుదును
కొంచక సవతులను కోపగింతును
పంచల నీ వలపు లేప డఁతిపై నుండునో
అంచు మోవ నాకు నదే ఆనతియ్యవయ్యా

(॥॥)
యెనసినసంతసాన యెవ్వరినిఁ గైకోను
చనవున బొమ్మలనే జంకింతును
వొనర శ్రీ వేంకటేశ వొక్క టైతి మిద్దరము
అనుమాన మెల్లఁ బాసె నానతియ్యవయ్యా.

(||pallavi||)
yĕṁtaina nā voja mānam̐ḍemi sedunu
aṁtaraṁga mĕllā nādo nānadiyyavayyā

(||||)
nī mannana paṭṭu kŏni ne niṁdarī navvudunu
vemaru nā rājasāna viṭravīm̐gudu
semuṁchi yidĕllā nī sittamu vachchuno rādo
ā māḍa nādo nīvānadiyyavayyā

(||||)
pĕṁchina maṁdĕmeḽāna pĕkku vĕṁge lāḍudunu
kŏṁchaga savadulanu kobagiṁtunu
paṁchala nī valabu leba ḍam̐tibai nuṁḍuno
aṁchu mova nāgu nade ānadiyyavayyā

(||||)
yĕnasinasaṁtasāna yĕvvarinim̐ gaigonu
sanavuna bŏmmalane jaṁkiṁtunu
vŏnara śhrī veṁkaḍeśha vŏkka ṭaidi middaramu
anumāna mĕllam̐ bāsĕ nānadiyyavayyā.