Yemtadi nerubarivi yemani pogadavachchu

యెంతటి నేరుపరివి యేమని పొగడవచ్చు
Language

(॥పల్లవి॥)
యెంతటి నేరుపరివి యేమని పొగడవచ్చు
వింత నీ సుద్దులు చూచి వేడుకాయ నాకును

(॥॥)
చనవిచ్చి నీవు మోవి చవులు చూపఁగాను
తనివిఁ బొందె నాతలఁ పెల్లను
మునుకొని నీవు నామొగమై నిలువఁగాను
పెనగొన్న సంతోసము పెడరేఁగె నాకును

(॥॥)
పక్కన నీవు నాకు బాగా లొసగఁగాను
యిక్కువలు గరఁగను ఇంతలోనె
చెక్కు నొక్కి నీవు నన్ను సిగ్గులు దేరుచఁగాను
నెక్కొన్న కోరికలు నెరవేరె నాకును

(॥॥)
కందువ నుండినన్నుఁ గౌఁగిలించుకొనఁగాను
చిందె నా సెలవులనుఁ జిరునవ్వులు
యిందునే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
పొందితివి రతుల నీభోగ మబ్బె నాకును

(||pallavi||)
yĕṁtaḍi nerubarivi yemani pŏgaḍavachchu
viṁta nī suddulu sūsi veḍugāya nāgunu

(||||)
sanavichchi nīvu movi savulu sūbam̐gānu
tanivim̐ bŏṁdĕ nādalam̐ pĕllanu
munugŏni nīvu nāmŏgamai niluvam̐gānu
pĕnagŏnna saṁtosamu pĕḍarem̐gĕ nāgunu

(||||)
pakkana nīvu nāgu bāgā lŏsagam̐gānu
yikkuvalu garam̐ganu iṁtalonĕ
sĕkku nŏkki nīvu nannu siggulu derusam̐gānu
nĕkkŏnna korigalu nĕraverĕ nāgunu

(||||)
kaṁduva nuṁḍinannum̐ gaum̐giliṁchugŏnam̐gānu
siṁdĕ nā sĕlavulanum̐ jirunavvulu
yiṁdune śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
pŏṁdidivi radula nībhoga mabbĕ nāgunu