Yemta vodambaraseeni yeedamdu nannu

యెంత వొడఁబరచీని యీతఁడు నన్ను
Language

(॥పల్లవి॥)
యెంత వొడఁబరచీని యీతఁడు నన్ను
వింత యేదే యిందులోను విచారించితేను

(॥॥)
తానన్ను మన్నించినాఁడు తన దేవులను నేను
యేను సేసే విన్నపము లిఁక నేఁటివే
మానఁడు నాపై బత్తి మరిగితి ముందే నేను
ఆనుకొని కొసరి నే నడిగేదేమే

(॥॥)
సేసవెట్టేఁ జేతులార శిరసు నేనూ నొగ్గితి
ఆసలెల్లా నెరవేరే నడ్డ మేడదే
సేసినాఁడు నాకు మేలు చిత్తము తనకు దక్కె
యే సుద్దులు నే నిఁక నెచ్చరించే దేమే

(॥॥)
మెచ్చి నన్నుఁ గౌఁగిలించె మీటు గుబ్బల నొత్తితి
అచ్చమాయఁ జుట్టమరయ నేదే
కొచ్చి శ్రీ వేంకటేశుఁడు కూడె నేనూఁ దనిసితి
యిచ్చకపు తనమన నెఱిఁగే దేమే

(||pallavi||)
yĕṁta vŏḍam̐barasīni yīdam̐ḍu nannu
viṁta yede yiṁdulonu visāriṁchidenu

(||||)
tānannu manniṁchinām̐ḍu tana devulanu nenu
yenu sese vinnabamu lim̐ka nem̐ṭive
mānam̐ḍu nābai batti marigidi muṁde nenu
ānugŏni kŏsari ne naḍigedeme

(||||)
sesavĕṭṭem̐ jedulāra śhirasu nenū nŏggidi
āsalĕllā nĕravere naḍḍa meḍade
sesinām̐ḍu nāgu melu sittamu tanagu dakkĕ
ye suddulu ne nim̐ka nĕchchariṁche deme

(||||)
mĕchchi nannum̐ gaum̐giliṁchĕ mīḍu gubbala nŏttidi
achchamāyam̐ juṭṭamaraya nede
kŏchchi śhrī veṁkaḍeśhum̐ḍu kūḍĕ nenūm̐ danisidi
yichchagabu tanamana nĕṟim̐ge deme