Yemta tamageenani nannelayimchevu

యెంత తమకీనని నన్నెలయించేవు
Language

(॥పల్లవి॥)
యెంత తమకీనని నన్నెలయించేవు
చింత నీపై బుట్టితేను చెమరించవలదా

(॥॥)
కన్నుల నీవు చూచితే గక్కన నెవ్వతెకైనా
మిన్నక యాస లెల్లాను మించ వలదా
సన్నలు నీవు సేసితే సరుగనఁ గౌఁగి టిడి
పన్ని నీమీఁద మనసు పారఁగ వలదా

(॥॥)
యిచ్చలఁ జన్ను లంటితే నెవ్వతెకైనా నిట్టే
రిచ్చలతో సిగ్గు లెల్లా రేఁగ వలదా
ముచ్చట మర్మము నీవు మోవఁగఁ బలికితేను
రచ్చలోన నైనా నవ్వు రావలదా

(॥॥)
నెట్టనఁ గౌఁగిట నీవు నించితే నెవ్వతెకైనా
గట్టిగా సంతోస మిట్టే కప్పవలదా
అట్టి శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
జట్టిగా నన్నేలితివి సారె మెచ్చవలదా.

(||pallavi||)
yĕṁta tamagīnani nannĕlayiṁchevu
siṁta nībai buṭṭidenu sĕmariṁchavaladā

(||||)
kannula nīvu sūside gakkana nĕvvadĕgainā
minnaga yāsa lĕllānu miṁcha valadā
sannalu nīvu seside saruganam̐ gaum̐gi ṭiḍi
panni nīmīm̐da manasu pāram̐ga valadā

(||||)
yichchalam̐ jannu laṁṭide nĕvvadĕgainā niṭṭe
richchalado siggu lĕllā rem̐ga valadā
muchchaḍa marmamu nīvu movam̐gam̐ baligidenu
rachchalona nainā navvu rāvaladā

(||||)
nĕṭṭanam̐ gaum̐giḍa nīvu niṁchide nĕvvadĕgainā
gaṭṭigā saṁtosa miṭṭe kappavaladā
aṭṭi śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
jaṭṭigā nannelidivi sārĕ mĕchchavaladā.