Yemta selubado kaani idivo taanu

యెంత చెలుబడో కాని ఇదివో తాను
Language

(॥పల్లవి॥)
యెంత చెలుబడో కాని ఇదివో తాను
కాంతుఁడు తన మాటకుఁ గాదనేనా నేను

(॥॥)
సన్నల చాయల వాఁడు సందుకొని వచ్చె నేఁడు
చన్నులు వట్టేఁ జూడవే జాజరకాఁడు
యెన్నేసి నవ్వులు నవ్వీ నెంతైనాఁ బోనీఁడు
కన్నెల గంటేఁ జాలు కాతరీఁడు

(॥॥)
తనతో నలుగ లేదు తానే తీసె వాదు
పొనుఁగ నిఁక నేఁటికే పొద్దు వోదు
చెనకె నూరకే నన్ను చెప్పితే నెంత లేదు
వనితలతోఁ బోర వరుసగాదు

(॥॥)
కందువతోఁ గౌఁగిలించి కడు గురుతులు నించి
యిందరిలో నా గుణాలు యెంచి యెంచి
మందలించి నన్ను నేలె మక్కువ నాపైఁ బెంచి
అందపు శ్రీ వేంకటేశుఁ డతివల మించి

(||pallavi||)
yĕṁta sĕlubaḍo kāni idivo tānu
kāṁtum̐ḍu tana māḍagum̐ gādanenā nenu

(||||)
sannala sāyala vām̐ḍu saṁdugŏni vachchĕ nem̐ḍu
sannulu vaṭṭem̐ jūḍave jājaragām̐ḍu
yĕnnesi navvulu navvī nĕṁtainām̐ bonīm̐ḍu
kannĕla gaṁṭem̐ jālu kādarīm̐ḍu

(||||)
tanado naluga ledu tāne tīsĕ vādu
pŏnum̐ga nim̐ka nem̐ṭige pŏddu vodu
sĕnagĕ nūrage nannu sĕppide nĕṁta ledu
vanidaladom̐ bora varusagādu

(||||)
kaṁduvadom̐ gaum̐giliṁchi kaḍu gurudulu niṁchi
yiṁdarilo nā guṇālu yĕṁchi yĕṁchi
maṁdaliṁchi nannu nelĕ makkuva nābaim̐ bĕṁchi
aṁdabu śhrī veṁkaḍeśhum̐ ḍadivala miṁchi