Yemta pani galado yemauno nee kaabe

యెంత పని గలదో యేమౌనో నీ కాపె
Language

(॥పల్లవి॥)
యెంత పని గలదో యేమౌనో నీ కాపె
వింతగా నప్పటి నుండే వేళ చూచుకొన్నది

(॥॥)
మానినితో నీ విప్పడు మరి యేకత మాడఁగా
కానిక దెచ్చి యొకతె గాచుకున్నది
పానుపు పై మీ రిద్దరుఁ బవ్వళించి వుండఁగాను
పానిపట్టే నీ పదాలు పాడుకొంటా నున్నది

(॥॥)
తేరకొన మీ రిద్దరుఁ దెర వేసుకుండఁ గాను
నీ రాక గోరుకొని నిలుచున్నది
మేరతోడ మీలోన మీరు వీడే లందుకోఁగా
చేరి నీకు మొక్కే నంటాఁ జేతులెత్తుకున్నది

(॥॥)
అంగవించి మీరు రతి నలయుచుండఁ గాను
తొంగి చూపుల వాకిటఁ దొట్టు కున్నది
సంగతిగ శ్రీ వేంకటేశ్వర నీ వింతలో వచ్చి
సంగడిఁ దన్ను నేలితే సన్న సేయుచున్నది

(||pallavi||)
yĕṁta pani galado yemauno nī kābĕ
viṁtagā nappaḍi nuṁḍe veḽa sūsugŏnnadi

(||||)
māninido nī vippaḍu mari yegada māḍam̐gā
kāniga dĕchchi yŏgadĕ gāsugunnadi
pānubu pai mī riddarum̐ bavvaḽiṁchi vuṁḍam̐gānu
pānibaṭṭe nī padālu pāḍugŏṁṭā nunnadi

(||||)
teragŏna mī riddarum̐ dĕra vesuguṁḍam̐ gānu
nī rāga gorugŏni nilusunnadi
meradoḍa mīlona mīru vīḍe laṁdugom̐gā
seri nīgu mŏkke naṁṭām̐ jedulĕttugunnadi

(||||)
aṁgaviṁchi mīru radi nalayusuṁḍam̐ gānu
tŏṁgi sūbula vāgiḍam̐ dŏṭṭu kunnadi
saṁgadiga śhrī veṁkaḍeśhvara nī viṁtalo vachchi
saṁgaḍim̐ dannu nelide sanna seyusunnadi