యెంత నే నెఱఁగకున్నా నెప్పుడూ నీవే గతి
(॥పల్లవి॥)
యెంత నే నెఱఁగకున్నా నెప్పుడూ నీవే గతి
వింతలేక మన్నించి విచ్చేయుమా యింటికి
(॥॥)
నినుఁ గూడే తమకము నిలుప లేక నేను
కినిసి వేమారు వెంగెములాడుదు
పొనుఁగ నీ రతి దలపోసి పోసి నేను
అనువురాక వట్టి యలుకఁ బొరలుదు
(॥॥)
కన్నుల నిన్నుఁ జూచే కాంతాళమున నేను
పన్నుక సారెఁ దప్పులు పట్టుతా నుందు
యెన్నరాని కౌఁగిలి యిట్టే కోరి కోరి నేను
నన్నలా చాయలాను జంకించి సొలతును
(॥॥)
నీ మన్నన లింతంతన నేరక ఇప్పుడు నేను
కామించి నీ కౌఁగిట గర్వింతును
యీ మేరల శ్రీ వేంకటేశ నన్నేలితివి
ఆముకొన్న సంతోసాన నానందింతునూ
(||pallavi||)
yĕṁta ne nĕṟam̐gagunnā nĕppuḍū nīve gadi
viṁtalega manniṁchi vichcheyumā yiṁṭigi
(||||)
ninum̐ gūḍe tamagamu niluba lega nenu
kinisi vemāru vĕṁgĕmulāḍudu
pŏnum̐ga nī radi dalabosi posi nenu
anuvurāga vaṭṭi yalugam̐ bŏraludu
(||||)
kannula ninnum̐ jūse kāṁtāḽamuna nenu
pannuga sārĕm̐ dappulu paṭṭudā nuṁdu
yĕnnarāni kaum̐gili yiṭṭe kori kori nenu
nannalā sāyalānu jaṁkiṁchi sŏladunu
(||||)
nī mannana liṁtaṁtana neraga ippuḍu nenu
kāmiṁchi nī kaum̐giḍa garviṁtunu
yī merala śhrī veṁkaḍeśha nannelidivi
āmugŏnna saṁtosāna nānaṁdiṁtunū