యెంత మన్నించేవు నే నీ కేమి బాఁతి
(॥పల్లవి॥)
యెంత మన్నించేవు నే నీ కేమి బాఁతి
చింతల యే నోము నోఁచితినో తొలుతను
(॥॥)
నవ్వుతా నీ పాదములు నామీఁదఁ జాఁచేవు
యెవ్వరిఁ బోలుదు నీ యింతులలోను
వువ్విళ్ళూర నప్పటిని వొడి వట్టి పెనఁగేవు
ఇవ్వల నీకును నాకు నేడ కే డంతరము
(॥॥)
కందువ నా చన్ను లంటి కడు సరస మాడేవు
పొందుగ నీ కాలి గోరఁ బోలుదునా
విందుగా నా మాటలకు వేడుక పడేవు నీవు
అంది నీతో నీడు వెట్టే యంతటిదాననా
(॥॥)
యేలుకొని శ్రీ వేంకటేశ నీ నీడవలెఁ
బోలించి నన్నుఁ బాయ వే పొద్దును నీవు
మేలుదాన నని ఇట్టే మెచ్చేవు లాలించి
సోలి నా గుణాలు చెప్పి చూప నే మున్నది
(||pallavi||)
yĕṁta manniṁchevu ne nī kemi bām̐ti
siṁtala ye nomu nom̐sidino tŏludanu
(||||)
navvudā nī pādamulu nāmīm̐dam̐ jām̐sevu
yĕvvarim̐ boludu nī yiṁtulalonu
vuvviḽḽūra nappaḍini vŏḍi vaṭṭi pĕnam̐gevu
ivvala nīgunu nāgu neḍa ke ḍaṁtaramu
(||||)
kaṁduva nā sannu laṁṭi kaḍu sarasa māḍevu
pŏṁduga nī kāli goram̐ boludunā
viṁdugā nā māḍalagu veḍuga paḍevu nīvu
aṁdi nīdo nīḍu vĕṭṭe yaṁtaḍidānanā
(||||)
yelugŏni śhrī veṁkaḍeśha nī nīḍavalĕm̐
boliṁchi nannum̐ bāya ve pŏddunu nīvu
meludāna nani iṭṭe mĕchchevu lāliṁchi
soli nā guṇālu sĕppi sūba ne munnadi