యెంత లేదు నా యాసోద మెంచి నీతోఁ జెప్పేనంటే
(॥పల్లవి॥)
యెంత లేదు నా యాసోద మెంచి నీతోఁ జెప్పేనంటే
యింతటి చనవు నాకు నిచ్చితివిగా
(॥॥)
తలఁచితే నీ రూపు తావుకొనె నాలోన
కులుకు నాచూపులకు గుఱి యైతివి
పిలిచే నంటే నీ పేరు పెదవులపై నున్నది
యెలమి నీ వుపకార మింత చాలదా
(॥॥)
చేరి పాదాలొత్తేనంటే చేతిలో నున్నాఁడవు
నేరిచి సరసమాడ నీవు గలవు
గారవించి నీవు నాకుఁ గడుఁ జుట్టమ వైతివి
యీరీతి నెంచితే గుణా లెన్నైనాఁ గలవూ
(॥॥)
పొసఁగి నా వీనులకు పొందైనకత వైతివి
వెస నామోవితేనెకు వింద వైతివి
పసగ శ్రీ వేంకటేశ బడి నలమేల్మంగను
యెనసి కూడితి విదె యెన్నికాయ నాకూ
(||pallavi||)
yĕṁta ledu nā yāsoda mĕṁchi nīdom̐ jĕppenaṁṭe
yiṁtaḍi sanavu nāgu nichchidivigā
(||||)
talam̐side nī rūbu tāvugŏnĕ nālona
kulugu nāsūbulagu guṟi yaidivi
pilise naṁṭe nī peru pĕdavulabai nunnadi
yĕlami nī vubagāra miṁta sāladā
(||||)
seri pādālŏttenaṁṭe sedilo nunnām̐ḍavu
nerisi sarasamāḍa nīvu galavu
gāraviṁchi nīvu nāgum̐ gaḍum̐ juṭṭama vaidivi
yīrīdi nĕṁchide guṇā lĕnnainām̐ galavū
(||||)
pŏsam̐gi nā vīnulagu pŏṁdainagada vaidivi
vĕsa nāmovidenĕgu viṁda vaidivi
pasaga śhrī veṁkaḍeśha baḍi nalamelmaṁganu
yĕnasi kūḍidi vidĕ yĕnnigāya nāgū