యెంత కుచ్చితురాలంటా నేల నన్ను దూరేవు నీ
(॥పల్లవి॥)
యెంత కుచ్చితురాలంటా నేల నన్ను దూరేవు నీ-
చెంత నాకె వుండఁగాను సిగ్గుపడవలదా
(॥॥)
ఆకె నీవు నేకతము లాడుకొంటా నుండఁగాను
నాకిటను నిలుచుండవద్దా నాకు
చేకొని మీలో మీరు చేసన్నలు నేసుకోఁగా
దాకొని పరాకు సేయఁదగవు గాదా
(॥॥)
చాయల నాకె నీవు సారె మొగాలు చూడఁగా
చేయి మాఁదువెట్టు కోను చెల్లదా నాకు
పాయక మీ రిద్దరును పచ్చడము గప్పుకోఁగా
యీ యెడ నే జూజమాడే దితవే కాదా
(॥॥)
అలమేలుమంగ వురమందు నీకు నుండఁగాను
తలవంచుకొని మొక్కవలెఁగా నాకు
యెలమి శ్రీ వేంకటేశ యేలితిరి మీరిద్దరు
వెలయ మిమ్ముఁ గొలువ వేడుకే కాదా
(||pallavi||)
yĕṁta kuchchidurālaṁṭā nela nannu dūrevu nī-
sĕṁta nāgĕ vuṁḍam̐gānu siggubaḍavaladā
(||||)
āgĕ nīvu negadamu lāḍugŏṁṭā nuṁḍam̐gānu
nāgiḍanu nilusuṁḍavaddā nāgu
segŏni mīlo mīru sesannalu nesugom̐gā
dāgŏni parāgu seyam̐dagavu gādā
(||||)
sāyala nāgĕ nīvu sārĕ mŏgālu sūḍam̐gā
seyi mām̐duvĕṭṭu konu sĕlladā nāgu
pāyaga mī riddarunu pachchaḍamu gappugom̐gā
yī yĕḍa ne jūjamāḍe didave kādā
(||||)
alamelumaṁga vuramaṁdu nīgu nuṁḍam̐gānu
talavaṁchugŏni mŏkkavalĕm̐gā nāgu
yĕlami śhrī veṁkaḍeśha yelidiri mīriddaru
vĕlaya mimmum̐ gŏluva veḍuge kādā