యెంత కాతరపు దని యెంచేవు గనక నీవు
(॥పల్లవి॥)
యెంత కాతరపు దని యెంచేవు గనక నీవు
సంతోసాన సారె నిన్ను జరతుఁ జుమ్మీ
(॥॥)
తలఁపులో నీవు నాపై దయగల దెఱుఁగుదు
వలపు మిక్కుటమై సొలతుఁ గాని
చలివాయ నీవు నాకు చన విచ్చు టెఱుఁగుదు
పిలిచి నీతో నూరకె పెనఁగుదుఁ గాని
(॥॥)
చేరి నాతోఁ గాఁపురము సేసేది నే నెఱుఁగుదు
కోరి నీపై బత్తితోడ గునుతుఁ గాని
గారవించి నీవు నన్నుఁ గలసేది నే నెఱుఁగుదు
కేరి నీ వింత రతికి వేగిరింతుఁ గాని
(॥॥)
వురము పైన న్నిడుక వుండేది నే నెఱుఁగుదు
సరసములకు నిన్ను సాదింతుఁగాని
నిరతి శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
పరగ నేలితి వింకాఁ బచారింతుఁ గాని.
(||pallavi||)
yĕṁta kādarabu dani yĕṁchevu ganaga nīvu
saṁtosāna sārĕ ninnu jaradum̐ jummī
(||||)
talam̐pulo nīvu nābai dayagala dĕṟum̐gudu
valabu mikkuḍamai sŏladum̐ gāni
salivāya nīvu nāgu sana vichchu ṭĕṟum̐gudu
pilisi nīdo nūragĕ pĕnam̐gudum̐ gāni
(||||)
seri nādom̐ gām̐puramu sesedi ne nĕṟum̐gudu
kori nībai battidoḍa gunudum̐ gāni
gāraviṁchi nīvu nannum̐ galasedi ne nĕṟum̐gudu
keri nī viṁta radigi vegiriṁtum̐ gāni
(||||)
vuramu paina nniḍuga vuṁḍedi ne nĕṟum̐gudu
sarasamulagu ninnu sādiṁtum̐gāni
niradi śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu
paraga nelidi viṁkām̐ basāriṁtum̐ gāni.