Yemta jaanaro yee kaligi

యెంత జాణరో యీ కలికి
Language

(॥పల్లవి॥)
యెంత జాణరో యీ కలికి
కాంతుఁడ నీ భోగములకే తగునూ

(॥॥)
చెలి నీ కౌఁగిటిచెమటలఁ జేసెను
చలువగ నిప్పుడు జల కేలి
అలరుచుఁ గుచముల నదుముచుఁ జేసెను
పలుమరు ముదములఁ బర్వతకేలి

(॥॥)
పై పై బెనఁగుచు బాహులతలనే
వైపుగఁ జేసెను పనకేలి
చూపుల నీపయి సొలయుచుఁ జేసెను
పూఁప వసంతము పూవులకేలి

(॥॥)
అరుదుగ నట్టివి యధరామృతముల
సరిఁ జేసెను భోజనకేలి
కరఁగుచు శ్రీ వేంకటేశ సేసేను
పరగిన రతులనె పరిణయకేలి.

(||pallavi||)
yĕṁta jāṇaro yī kaligi
kāṁtum̐ḍa nī bhogamulage tagunū

(||||)
sĕli nī kaum̐giḍisĕmaḍalam̐ jesĕnu
saluvaga nippuḍu jala keli
alarusum̐ gusamula nadumusum̐ jesĕnu
palumaru mudamulam̐ barvadageli

(||||)
pai pai bĕnam̐gusu bāhuladalane
vaibugam̐ jesĕnu panageli
sūbula nībayi sŏlayusum̐ jesĕnu
pūm̐pa vasaṁtamu pūvulageli

(||||)
aruduga naṭṭivi yadharāmṛtamula
sarim̐ jesĕnu bhojanageli
karam̐gusu śhrī veṁkaḍeśha sesenu
paragina radulanĕ pariṇayageli.