యెంత జాణతనమో నా కెటువంటి మొగమోటో
(॥పల్లవి॥)
యెంత జాణతనమో నా కెటువంటి మొగమోటో
సంతోసించఁ జేసి నీకు చనవరి యాయను
(॥॥)
చెప్పరాని ప్రియములు చెప్పి నిన్నింత వలపు
చిప్పిలఁ దన మొగము సేసుకొనెను
నెప్పున నీ చిత్తము రా నిచ్చలూ గొలిచీ నిన్ను
నప్పుడే మంచిమాటలూ నాడించుకొనెను
(॥॥)
పెనఁగి పెనఁగి నీకు పెక్కు వూడిగాలు సేసి
ననుపున నీ నెలవి నవ్వు రేఁ చెను
చెనకి వినయమున చెక్కు నొక్కి వేఁడుకొని
తనిపి నీ మోవి తేనె తా నిప్పించుకొనెను
(॥॥)
పానుపు పైఁ బవ్వళించి పక్కనఁ జన్నుల నొత్తి
సోనల చెమట తోడఁ జొక్కించెను
పూని యలమేలుమంగ పొంచి శ్రీ వేంకటేశ్వర
తానే నిన్నుఁ బెండ్లాడి తగులై నిలిచెనూ
(||pallavi||)
yĕṁta jāṇadanamo nā kĕḍuvaṁṭi mŏgamoḍo
saṁtosiṁcham̐ jesi nīgu sanavari yāyanu
(||||)
sĕpparāni priyamulu sĕppi ninniṁta valabu
sippilam̐ dana mŏgamu sesugŏnĕnu
nĕppuna nī sittamu rā nichchalū gŏlisī ninnu
nappuḍe maṁchimāḍalū nāḍiṁchugŏnĕnu
(||||)
pĕnam̐gi pĕnam̐gi nīgu pĕkku vūḍigālu sesi
nanubuna nī nĕlavi navvu rem̐ sĕnu
sĕnagi vinayamuna sĕkku nŏkki vem̐ḍugŏni
tanibi nī movi tenĕ tā nippiṁchugŏnĕnu
(||||)
pānubu paim̐ bavvaḽiṁchi pakkanam̐ jannula nŏtti
sonala sĕmaḍa toḍam̐ jŏkkiṁchĕnu
pūni yalamelumaṁga pŏṁchi śhrī veṁkaḍeśhvara
tāne ninnum̐ bĕṁḍlāḍi tagulai nilisĕnū