Yemta gattuvaaya yidi yeda galige neegu

యెంత గట్టువాయ యిది యేడ గలిగె నీకు
Language

(॥పల్లవి॥)
యెంత గట్టువాయ యిది యేడ గలిగె నీకు
యింతి యెందుండి వచ్చెను యెవ్వతెయ్యా

(॥॥)
నెలఁత సారె సారెకు నీ పాదాలు పిసుకుతా
సలిగెలు చూపీ ని సవతులకు
పిలువని పేరటము పెందలకాడే వచ్చి
కొలువులు సేసి తన గుఱుతెఱిఁగించీని

(॥॥)
వట్టూడిగాలు సేసి నీ వద్దనే కాచుకుండి
చుట్టరికాలు చెప్పీని సుదతులతో
చుట్టి చుట్టి నీ మొగము చూచి తానే నవ్వుతాను
యెట్ట నెదుటనే వుండి యెమ్మెలు చూపీని

(॥॥)
విరులు నీకు ముడిచి విన్నపాలు సేసుకొంటా
దొరతనములు చూపీఁ దొయ్యలులకూ
వురాన నలమేల్మంగ వుండఁ గా శ్రీ వేంకటేశ
తెరవేసి వీడె మిచ్చి తేలించీ మాటలను

(||pallavi||)
yĕṁta gaṭṭuvāya yidi yeḍa galigĕ nīgu
yiṁti yĕṁduṁḍi vachchĕnu yĕvvadĕyyā

(||||)
nĕlam̐ta sārĕ sārĕgu nī pādālu pisugudā
saligĕlu sūbī ni savadulagu
piluvani peraḍamu pĕṁdalagāḍe vachchi
kŏluvulu sesi tana guṟudĕṟim̐giṁchīni

(||||)
vaṭṭūḍigālu sesi nī vaddane kāsuguṁḍi
suṭṭarigālu sĕppīni sudadulado
suṭṭi suṭṭi nī mŏgamu sūsi tāne navvudānu
yĕṭṭa nĕduḍane vuṁḍi yĕmmĕlu sūbīni

(||||)
virulu nīgu muḍisi vinnabālu sesugŏṁṭā
dŏradanamulu sūbīm̐ dŏyyalulagū
vurāna nalamelmaṁga vuṁḍam̐ gā śhrī veṁkaḍeśha
tĕravesi vīḍĕ michchi teliṁchī māḍalanu