యెంత భాగ్యవంతుఁడవో ఇటువంటి సతి గల్గె
(॥పల్లవి॥)
యెంత భాగ్యవంతుఁడవో ఇటువంటి సతి గల్గె
సంతోసించుకొంటిమి మీ సరితెలు చూచి
(॥॥)
అండనుండి యెవ్వతో అట్టే నీకు నొక్కొక్కటే
బొండుమల్లె పానుపుపై బుద్ది చెప్పిని
పండఁబడి మోవితేనె పానకముచవి చూపి
చండి పెట్టి చన్నులతో సాము సేయించీని
(॥॥)
తా నెవ్వతో పెచ్చు రేఁగి దంతపుటోవరిలోన
నానుఁ జెమటల నిన్ను నవ్వింపించీని
సానఁబట్టేచూపులను సన్నలనే జంకించి
వూనిన రతులలోన నోలలాడించీని
(॥॥)
గుట్టున నెవ్వతో యిది కోరి పచ్చడములో
చుట్టుక చుట్టుక కూడి సొంపు నించీని
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యిట్టే నన్ను నేలితివి యీకె నిన్ను మెచ్చీని
(||pallavi||)
yĕṁta bhāgyavaṁtum̐ḍavo iḍuvaṁṭi sadi galgĕ
saṁtosiṁchugŏṁṭimi mī saridĕlu sūsi
(||||)
aṁḍanuṁḍi yĕvvado aṭṭe nīgu nŏkkŏkkaḍe
bŏṁḍumallĕ pānububai buddi sĕppini
paṁḍam̐baḍi movidenĕ pānagamusavi sūbi
saṁḍi pĕṭṭi sannulado sāmu seyiṁchīni
(||||)
tā nĕvvado pĕchchu rem̐gi daṁtabuḍovarilona
nānum̐ jĕmaḍala ninnu navviṁpiṁchīni
sānam̐baṭṭesūbulanu sannalane jaṁkiṁchi
vūnina radulalona nolalāḍiṁchīni
(||||)
guṭṭuna nĕvvado yidi kori pachchaḍamulo
suṭṭuga suṭṭuga kūḍi sŏṁpu niṁchīni
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yiṭṭe nannu nelidivi yīgĕ ninnu mĕchchīni