యెంత ఆసోదమో(?) యని యెంచేవు సుమీ
(॥పల్లవి॥)
యెంత ఆసోదమో(?) యని యెంచేవు సుమీ
యింతినై వున్నదాన నీకు నేమియు నెఱఁగను
(॥॥)
అట్టే నీతోఁ జెలఁగి మాటాడియుఁ దనియను
దట్టపుఁ జూపులఁ జూచీ తనియను
పట్టి పెనఁగి పెనఁగి పలుమారుఁ దనియను
యెట్టు మోహింపించితివో యెఱఁగ నేను
(॥॥)
చిమ్ముచు వినయములు సేసియుఁ దనియను
తమ్మి చేతులెత్తి మొక్కీఁ దనియను
పమ్మి నీ గుణములు భావించీ దనియను
ఇమ్ముల నింత సేసితి వేమీ నెఱఁగను
(॥॥)
గక్కన నీ పాదములు కౌఁగిలించీ తనియను
దక్కఁగొని మోవి యానీ తనియను
ఇక్కడ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
యెక్కడా నన్నే యేలితి వెఱఁగ నితరము
(||pallavi||)
yĕṁta āsodamo(?) yani yĕṁchevu sumī
yiṁtinai vunnadāna nīgu nemiyu nĕṟam̐ganu
(||||)
aṭṭe nīdom̐ jĕlam̐gi māḍāḍiyum̐ daniyanu
daṭṭabum̐ jūbulam̐ jūsī taniyanu
paṭṭi pĕnam̐gi pĕnam̐gi palumārum̐ daniyanu
yĕṭṭu mohiṁpiṁchidivo yĕṟam̐ga nenu
(||||)
simmusu vinayamulu sesiyum̐ daniyanu
tammi sedulĕtti mŏkkīm̐ daniyanu
pammi nī guṇamulu bhāviṁchī daniyanu
immula niṁta sesidi vemī nĕṟam̐ganu
(||||)
gakkana nī pādamulu kaum̐giliṁchī taniyanu
dakkam̐gŏni movi yānī taniyanu
ikkaḍa śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
yĕkkaḍā nanne yelidi vĕṟam̐ga nidaramu