యేమి విన్నపము సేసే వెంతైనాఁ గలదు పని
(॥పల్లవి॥)
యేమి విన్నపము సేసే వెంతైనాఁ గలదు పని
గామిడితనా లెఱఁగఁ గరుణించు మనవే
(॥॥)
పట్టీ పెనఁగఁగ నోప బాస లడుగఁగ నోప
వొట్టుక వొద్దఁ గాచుకుండ నోపుదు
ఱట్టడి విభుఁడు తాను ఱాతిగుండెవాఁడు తాను
గట్టిగా నా భావ మెంచి కరుణించు మనవే
(॥॥)
వేసాలదానఁ గాను వేగిరపు దానఁగాను
ఆసతో సేవలు సేసే అందు కౌదును
రాసి కెక్కెఁ దొల్లే తాను రాజసపువాఁడు తాను
వాసితో నన్నుఁ బాయని వరుస ఇమ్మనవే
(॥॥)
చలములు పచరించ జంకెనలు పచరించ
పలుమారు వలపులే బడి నింతును
చెలి యలమేల్మంగను శ్రీ వేంకటేశుఁడు తాను
కలసె నాగుణ మింకాఁ గనుఁగొన మనవే
(||pallavi||)
yemi vinnabamu sese vĕṁtainām̐ galadu pani
gāmiḍidanā lĕṟam̐gam̐ garuṇiṁchu manave
(||||)
paṭṭī pĕnam̐gam̐ga noba bāsa laḍugam̐ga noba
vŏṭṭuga vŏddam̐ gāsuguṁḍa nobudu
ṟaṭṭaḍi vibhum̐ḍu tānu ṟādiguṁḍĕvām̐ḍu tānu
gaṭṭigā nā bhāva mĕṁchi karuṇiṁchu manave
(||||)
vesāladānam̐ gānu vegirabu dānam̐gānu
āsado sevalu sese aṁdu kaudunu
rāsi kĕkkĕm̐ dŏlle tānu rājasabuvām̐ḍu tānu
vāsido nannum̐ bāyani varusa immanave
(||||)
salamulu pasariṁcha jaṁkĕnalu pasariṁcha
palumāru valabule baḍi niṁtunu
sĕli yalamelmaṁganu śhrī veṁkaḍeśhum̐ḍu tānu
kalasĕ nāguṇa miṁkām̐ ganum̐gŏna manave