Yemi seppere buddu lemdaamkaa naagu

యేమి చెప్పేరే బుద్దు లెందాఁకా నాకు
Language

(॥పల్లవి॥)
యేమి చెప్పేరే బుద్దు లెందాఁకా నాకు
కామించి యాతఁడు రాఁగాఁ గాదనేనా నేనూ

(॥॥)
చుట్టరికమే కలిగితే సుద్దు లెల్లా నింపు తాను
వెట్టికే మాటలాడితే వేసట వుట్టు
గుట్టు తోడి చిరునవ్వు గుణానకుఁ దేవచ్చు
బట్ట బయలు నవ్వితే బాఁతి గాదు

(॥॥)
ఆసలు గలిగితేనే అంటుకొను వేడుకలు
బేసబెల్లి(?) వేడుకలఁ బ్రియము లేదు
వాసితోడి సిగ్గులు వన్నె కెక్కు నన్నిటాను
పూసగొండి(?) సిగ్గులైతేఁ బోది సేయరాదు

(॥॥)
సంతోసమైనప్పుడు సమ్మతౌను మొక్కులు
పంతము తోడి మొక్కులు పనికిరావు
ఇంతలో శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
వింతలుగా నన్నుఁగూడె వెసఁబాయ నోపను

(||pallavi||)
yemi sĕppere buddu lĕṁdām̐kā nāgu
kāmiṁchi yādam̐ḍu rām̐gām̐ gādanenā nenū

(||||)
suṭṭarigame kaligide suddu lĕllā niṁpu tānu
vĕṭṭige māḍalāḍide vesaḍa vuṭṭu
guṭṭu toḍi sirunavvu guṇānagum̐ devachchu
baṭṭa bayalu navvide bām̐ti gādu

(||||)
āsalu galigidene aṁṭugŏnu veḍugalu
besabĕlli(?) veḍugalam̐ briyamu ledu
vāsidoḍi siggulu vannĕ kĕkku nanniḍānu
pūsagŏṁḍi(?) siggulaidem̐ bodi seyarādu

(||||)
saṁtosamainappuḍu sammadaunu mŏkkulu
paṁtamu toḍi mŏkkulu panigirāvu
iṁtalo śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
viṁtalugā nannum̐gūḍĕ vĕsam̐bāya nobanu