Yemi seppemayyaa needo nimti sudduloo

యేమి చెప్పేమయ్యా నీతో నింతి సుద్దులూ
Language

(॥పల్లవి॥)
యేమి చెప్పేమయ్యా నీతో నింతి సుద్దులూ
కామించె నిన్ను నీకెఁ గరుణించవయ్యా

(॥॥)
పడఁతి నిన్నుఁ దలఁచి బయలు గౌఁగిట నించు
బడి బడి నీ సుద్దులు భావించును
అడియాలములు చూచి ఆనందమున మించు
వుడివోని కోరికెల నుమ్మగిలును

(॥॥)
తక్కక నిన్నుఁ బేర్కొని తనలోనె సిగ్గువడు
చిక్కి నీ మాటాలకించి చెమరించును
మిక్కిలి నీ గుణాలకు మెచ్చి మెచ్చి లోలో నవ్వు
వొక్కటై నీ మోవితేనె కూరకె యాకారును

(॥॥)
సమరతు లూహించి సరసపు మాట లాడు
కొమరు నీ రూపు వ్రాసి గోర గీరును
తమి తో శ్రీ వేంకటేశ తగ నీ విట్టే వచ్చి
రమణిఁ గూడితివి యీ రతులే తలఁచును

(||pallavi||)
yemi sĕppemayyā nīdo niṁti suddulū
kāmiṁchĕ ninnu nīgĕm̐ garuṇiṁchavayyā

(||||)
paḍam̐ti ninnum̐ dalam̐si bayalu gaum̐giḍa niṁchu
baḍi baḍi nī suddulu bhāviṁchunu
aḍiyālamulu sūsi ānaṁdamuna miṁchu
vuḍivoni korigĕla nummagilunu

(||||)
takkaga ninnum̐ bergŏni tanalonĕ sigguvaḍu
sikki nī māḍālagiṁchi sĕmariṁchunu
mikkili nī guṇālagu mĕchchi mĕchchi lolo navvu
vŏkkaḍai nī movidenĕ kūragĕ yāgārunu

(||||)
samaradu lūhiṁchi sarasabu māḍa lāḍu
kŏmaru nī rūbu vrāsi gora gīrunu
tami to śhrī veṁkaḍeśha taga nī viṭṭe vachchi
ramaṇim̐ gūḍidivi yī radule talam̐sunu