యేమి సేతు నమ్మలాల యెవ్వరితోఁ జెప్పుదును
(॥పల్లవి॥)
యేమి సేతు నమ్మలాల యెవ్వరితోఁ జెప్పుదును
వోముచు నో చెలులాల వూరకున్నా రిపుడు
(॥॥)
పిలువఁగ వచ్చి నే నే ప్రియములు చెప్పే నంటే
వెలఁదులకు సిగ్గులు విడువరాదు
చలివాసి తన దిక్కు చక్కఁగాఁ జూచే నంటే
కొలఁది ఇల్లాండ్లకు గుట్టు మూలధనము
(॥॥)
వొనరఁ దనవద్దనే వూడిగాలు సేసే నంటే
వనితలకు పంతాలు వద్దా యందురు
గొనకొని నిలుచుండి కొలువులు సేసే నంటే
పెను రాణి వాసాలకు బిరుదు గంభీరము
(॥॥)
మంతనాన నాతనితో మాటలు నే నాడే నంటే
యింతులకు నారజము లింత దగదు
చెంత నిట్టే వచ్చి నాతో శ్రీ వేంకటేశుఁడు గూడె
కాంతలకు నిట్టే రతి కడుఁ బెద్దరికము
(||pallavi||)
yemi sedu nammalāla yĕvvaridom̐ jĕppudunu
vomusu no sĕlulāla vūragunnā ribuḍu
(||||)
piluvam̐ga vachchi ne ne priyamulu sĕppe naṁṭe
vĕlam̐dulagu siggulu viḍuvarādu
salivāsi tana dikku sakkam̐gām̐ jūse naṁṭe
kŏlam̐di illāṁḍlagu guṭṭu mūladhanamu
(||||)
vŏnaram̐ danavaddane vūḍigālu sese naṁṭe
vanidalagu paṁtālu vaddā yaṁduru
gŏnagŏni nilusuṁḍi kŏluvulu sese naṁṭe
pĕnu rāṇi vāsālagu birudu gaṁbhīramu
(||||)
maṁtanāna nādanido māḍalu ne nāḍe naṁṭe
yiṁtulagu nārajamu liṁta dagadu
sĕṁta niṭṭe vachchi nādo śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
kāṁtalagu niṭṭe radi kaḍum̐ bĕddarigamu