Yemi sedu naa tamaga miduvale nunnadi

యేమి సేతు నా తమక మిటువలె నున్నది
Language

(॥పల్లవి॥)
యేమి సేతు నా తమక మిటువలె నున్నది
నేమము లెల్లా నాకు నీ కొరకే కాదా

(॥॥)
వేమారు నీవు రావని వేసరించి దూరే దెల్లా
కామించి నీ పై బత్తినే కాదా నేను
ఆముకొని బొమ్మలను అట్టే మరి జంకించేది
దోమటి నీ తోడి పొందు కొరకు కాదా

(॥॥)
కొనచూపులను నిన్ను గుంపంచి చూచే దెల్లా
అనిశము నీతోఁ బాయలేకే కాదా
మనసు మర్మాలు సోఁక మాటలు నిన్నాడే దెల్లా
తనివోని కోరికల దైవారుతాఁ గాదా

(॥॥)
పచ్చిగా నిన్నుఁ జెనకి పంతములు చూపే దెల్లా
కొచ్చి కొచ్చి నిన్నుఁ గూడె కొరకే కాదా
యిచ్చట శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
మెచ్చి నన్నేలితివి యీమేలుకే కాదా

(||pallavi||)
yemi sedu nā tamaga miḍuvalĕ nunnadi
nemamu lĕllā nāgu nī kŏrage kādā

(||||)
vemāru nīvu rāvani vesariṁchi dūre dĕllā
kāmiṁchi nī pai battine kādā nenu
āmugŏni bŏmmalanu aṭṭe mari jaṁkiṁchedi
domaḍi nī toḍi pŏṁdu kŏragu kādā

(||||)
kŏnasūbulanu ninnu guṁpaṁchi sūse dĕllā
aniśhamu nīdom̐ bāyalege kādā
manasu marmālu som̐ka māḍalu ninnāḍe dĕllā
tanivoni korigala daivārudām̐ gādā

(||||)
pachchigā ninnum̐ jĕnagi paṁtamulu sūbe dĕllā
kŏchchi kŏchchi ninnum̐ gūḍĕ kŏrage kādā
yichchaḍa śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
mĕchchi nannelidivi yīmeluge kādā