Yemi gosaremayyaa imka ninnunu

యేమి గొసరేమయ్యా ఇఁక నిన్నును
Language

(॥పల్లవి॥)
యేమి గొసరేమయ్యా ఇఁక నిన్నును
ప్రేమతోడ సంగడిఁ బెట్టుకొంటి వాపెను

(॥॥)
ఇత్తల నత్తల నీ వెందరిఁ బెండ్లాడినా నీ
చిత్తము వచ్చినదే మించిన దేవులు
కొత్త సొమ్ములు పెట్టేలఁ గోరి యెన్ని వుండినాను
హత్తి నీమె నీపై నుండినదియే మంచిది

(॥॥)
అంగనామణులు నీ యండ నెంద రుండినా నీ
సంగడిఁ గూచుండినదే చక్కని సతి
సింగారించి వాహనాలు ముంగిట నెన్ని వుండినా
సంగతి నీ వెక్కినదే సాంబ్రాణి

(॥॥)
యెగి సరసమాడే ఇంతు లెందరుండినా నీ
పస నుర మెక్కినదే పట్టపురాణి
కొసరి శ్రీ వేంకటేశ కూడితివి మమ్ము నేఁడు
దెసల నీవు గట్టి నదే పీతాంబరము

(||pallavi||)
yemi gŏsaremayyā im̐ka ninnunu
premadoḍa saṁgaḍim̐ bĕṭṭugŏṁṭi vābĕnu

(||||)
ittala nattala nī vĕṁdarim̐ bĕṁḍlāḍinā nī
sittamu vachchinade miṁchina devulu
kŏtta sŏmmulu pĕṭṭelam̐ gori yĕnni vuṁḍinānu
hatti nīmĕ nībai nuṁḍinadiye maṁchidi

(||||)
aṁganāmaṇulu nī yaṁḍa nĕṁda ruṁḍinā nī
saṁgaḍim̐ gūsuṁḍinade sakkani sadi
siṁgāriṁchi vāhanālu muṁgiḍa nĕnni vuṁḍinā
saṁgadi nī vĕkkinade sāṁbrāṇi

(||||)
yĕgi sarasamāḍe iṁtu lĕṁdaruṁḍinā nī
pasa nura mĕkkinade paṭṭaburāṇi
kŏsari śhrī veṁkaḍeśha kūḍidivi mammu nem̐ḍu
dĕsala nīvu gaṭṭi nade pīdāṁbaramu