Yemee vooragumde vamtaa yela nannu noraseeni

యేమీ వూరకుండే వంటా యేల నన్ను నొరసీని
Language

(॥పల్లవి॥)
యేమీ వూరకుండే వంటా యేల నన్ను నొరసీని
కామించి తన గుట్టు గాన వసమటవే

(॥॥)
చక్కఁదనాలకే తన్ను సంతోసింతునో నేను
మిక్కిలి మంచి గుణాలు మెత్తునో మరి
తక్కక తన సుద్దులు దడవి పొగడుదునో
యెక్కడాఁ దన మహిమ లెంచ వసమటవే

(॥॥)
తన నేరుపులే యిట్టే తలఁచి నవ్వుదునో
అనిశము నుదారత్వ మాడుకొందునో
పనివడి ప్రతాపమే పరికించి చొక్కుదునో
యెన లేని తన సేఁత లెంచ వసమటవే

(॥॥)
ఆసఁ దన యీవులకు నచ్చెరు వందుదునో
సేసవెట్టి నందుకే చెలఁగుదునో
రాసి కెక్క నన్నుఁ గూడె రతి శ్రీ వేంకటేశుఁడు
యీ సరవుల మేలు యెంచ వసమటవే

(||pallavi||)
yemī vūraguṁḍe vaṁṭā yela nannu nŏrasīni
kāmiṁchi tana guṭṭu gāna vasamaḍave

(||||)
sakkam̐danālage tannu saṁtosiṁtuno nenu
mikkili maṁchi guṇālu mĕttuno mari
takkaga tana suddulu daḍavi pŏgaḍuduno
yĕkkaḍām̐ dana mahima lĕṁcha vasamaḍave

(||||)
tana nerubule yiṭṭe talam̐si navvuduno
aniśhamu nudāratva māḍugŏṁduno
panivaḍi pradābame parigiṁchi sŏkkuduno
yĕna leni tana sem̐ta lĕṁcha vasamaḍave

(||||)
āsam̐ dana yīvulagu nachchĕru vaṁduduno
sesavĕṭṭi naṁduge sĕlam̐guduno
rāsi kĕkka nannum̐ gūḍĕ radi śhrī veṁkaḍeśhum̐ḍu
yī saravula melu yĕṁcha vasamaḍave