యేమే మీ నేరుపెల్ల నిఁక నెన్నఁడే
(॥పల్లవి॥)
యేమే మీ నేరుపెల్ల నిఁక నెన్నఁడే
మోము చూచి గుట్టుతోనె మొక్కవలెఁ గాకా
(॥॥)
మాటలాడుకో రాదా మనసు లొక్కటి గాఁగ
గాఁటపు తొల్లిటి మీలో కపట మేలా
ఆఁటదాని కింతయేల ఆతఁ డేమి సేసినను
నాఁటిన చూపులఁ జూచి నవ్వవలెఁ గాకా
(॥॥)
బాసలు సేసుకోరాదా పంతములు సరిగాఁగ.
వేసరని మీలోని వెరగు లేల
సేస వెట్టిన వారికి చింతించ నిఁక నేల
ఆసతో నాయము లెల్ల నంటవలెఁ గాకా
(॥॥)
కౌఁగిలించుకోరాదా కాఁక మీలోఁ దీరఁగ
చేగ దేరే మీలోని సిగ్గు లేల
వీఁగక న న్నపుడే శ్రీ వేంకటేశుఁడు గూడే
మాఁ గిన మోవులతో సమ్మతిల్లవలెఁ గాకా.
(||pallavi||)
yeme mī nerubĕlla nim̐ka nĕnnam̐ḍe
momu sūsi guṭṭudonĕ mŏkkavalĕm̐ gāgā
(||||)
māḍalāḍugo rādā manasu lŏkkaḍi gām̐ga
gām̐ṭabu tŏlliḍi mīlo kabaḍa melā
ām̐ṭadāni kiṁtayela ādam̐ ḍemi sesinanu
nām̐ṭina sūbulam̐ jūsi navvavalĕm̐ gāgā
(||||)
bāsalu sesugorādā paṁtamulu sarigām̐ga.
vesarani mīloni vĕragu lela
sesa vĕṭṭina vārigi siṁtiṁcha nim̐ka nela
āsado nāyamu lĕlla naṁṭavalĕm̐ gāgā
(||||)
kaum̐giliṁchugorādā kām̐ka mīlom̐ dīram̐ga
sega dere mīloni siggu lela
vīm̐gaga na nnabuḍe śhrī veṁkaḍeśhum̐ḍu gūḍe
mām̐ gina movulado sammadillavalĕm̐ gāgā.