యెందుకైన వత్తువు ని న్నెవ్వఁడెఱుఁగు
(॥పల్లవి॥)
యెందుకైన వత్తువు ని న్నెవ్వఁడెఱుఁగు
నిందలకు వెరవవు నిలవయ్య చాలును
(॥॥)
వాసు లెక్కించి యెక్కించి వద్దన్నా మానక
యీసులు రేఁచితివి మా యిద్దరిలోన
వోసరించి మమ్మప్పటి నొడఁబరచ వచ్చేవు
నీ సుద్దు లెంత లేదు నిలవయ్య చాలును
(॥॥)
సన్నలు చేసి చేసి చలాలకే పోనీక
యిన్నేసి చేసితివి మా యిద్దరిలోన
నన్ను నాపెఁ గూడు మంటా నాయముఁ జెప్ప వచ్చేవు
నిన్న నే యన్నిఁ గంటిమి నిలవయ్య చాలును
(॥॥)
నగవులు నగి నగి నాటకాలకోప మన్న
యెగసక్కేలు చేసితి విద్దరిలోన
జిగి నిద్దరిఁ గూడితి శ్రీ వేంకటేశుఁడ మమ్ము
నిగిడె నీ మతకాలు నిలవయ్య చాలునూ.
(||pallavi||)
yĕṁdugaina vattuvu ni nnĕvvam̐ḍĕṟum̐gu
niṁdalagu vĕravavu nilavayya sālunu
(||||)
vāsu lĕkkiṁchi yĕkkiṁchi vaddannā mānaga
yīsulu rem̐sidivi mā yiddarilona
vosariṁchi mammappaḍi nŏḍam̐barasa vachchevu
nī suddu lĕṁta ledu nilavayya sālunu
(||||)
sannalu sesi sesi salālage ponīga
yinnesi sesidivi mā yiddarilona
nannu nābĕm̐ gūḍu maṁṭā nāyamum̐ jĕppa vachchevu
ninna ne yannim̐ gaṁṭimi nilavayya sālunu
(||||)
nagavulu nagi nagi nāḍagālagoba manna
yĕgasakkelu sesidi viddarilona
jigi niddarim̐ gūḍidi śhrī veṁkaḍeśhum̐ḍa mammu
nigiḍĕ nī madagālu nilavayya sālunū.